సీఎం వార్నింగ్ : బస్సులను అడ్డుకుంటే అరెస్ట్

ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్ గా ఉన్నారు. సమ్మె చట్టవిరుద్ధం అన్న సీఎం.. సమ్మె చేస్తున్న వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదన్నారు. విధుల్లోకి రానివారిని తిరిగి

  • Published By: veegamteam ,Published On : October 12, 2019 / 12:06 PM IST
సీఎం వార్నింగ్ : బస్సులను అడ్డుకుంటే అరెస్ట్

ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్ గా ఉన్నారు. సమ్మె చట్టవిరుద్ధం అన్న సీఎం.. సమ్మె చేస్తున్న వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదన్నారు. విధుల్లోకి రానివారిని తిరిగి

ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్ గా ఉన్నారు. సమ్మె చట్టవిరుద్ధం అన్న సీఎం.. సమ్మె చేస్తున్న వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదన్నారు. విధుల్లోకి రానివారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునేది లేదని తేల్చి చెప్పారు. 3 రోజుల్లో 100శాతం బస్సులు నడిచి తీరాల్సిందే అని అధికారులను ఆదేశించిన సీఎం.. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, సిబ్బందిని నియమించాలన్నారు. ఆర్టీసీ సమ్మె, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ అధికారులతో శనివారం(అక్టోబర్ 12,2019) సమీక్ష నిర్వహించారు.

అనంతరం డీజీపీ మహేందర్ రెడ్డితో సీఎం ఫోన్ లో మాట్లాడారు. బస్సులను అడ్డుకునేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. ఉద్యమం పేరిట విధ్వంసం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. డిపోలు, బస్టాండ్ ల దగ్గర భద్రత పెంచాలని డీజీపీకి ఆదేశాలు ఇచ్చారు.

ప్రతి ఆర్టీసీ డిపో, బస్టాండ్ల దగ్గర బందోబస్తు ఏర్పాటు చేయాలని.. అన్ని చోట్ల తక్షణమే సీసీ కెమెరాలు పెట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. భద్రత కోసం ఇంటెలిజెన్స్ పోలీసులను ఉపయోగించుకోవాలని సూచించారు. ఉద్యమం పేరుతో విధ్వంసం చేస్తే ఉపేక్షించొద్దని చెప్పారు. ప్రజలను ఇబ్బంది పెట్టేవారిపై కేసులు పెట్టి కోర్టులకు పంపాలని డీజీపీతో అన్నారు.

యూనియన్ల బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. ప్రజలకు, ఆర్టీసీకి నష్టం కలిగించిన కార్మికులను క్షమించేది లేదన్నారు. చట్టవిరుద్ధ సమ్మెకు రాజకీయపక్షాల మద్దతు అనైతికం అని మండిపడ్డారు. యూనియన్ నేతల మాటలు నమ్మి 48వేల మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారని సీఎం అన్నారు. ఆర్టీసీ సమ్మెపై మాట్లాడుతున్న బీజేపీ.. రైల్వే ప్రైవేటీకరణపై ఏం చెబుతుందని అడిగారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. రైల్వే, ఎయిర్ లైన్స్ ను ప్రైవేటీకరిస్తుంది.. చివరికి సికింద్రాబాద్ రైల్వేనూ ప్రైవేటీకరిస్తుందని మండిపడ్డారు. రైల్వేను ప్రైవేటుపరం చేసే పనిలో ఉన్న బీజేపీ… తెలంగాణలో మాత్రం ఆర్టీసీని ప్రభుత్వంలో కలపాలని ఎలా అంటుందని నిలదీశారు.