హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్ : చలి పంజా

  • Published By: madhu ,Published On : January 30, 2019 / 02:29 AM IST
హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్  : చలి పంజా

హైదరాబాద్ : చలి చంపేస్తోంది. ప్రధానంగా హైదరాబాద్ వాసులకు చలి చుక్కలు చూపిస్తోంది. తీవ్రమైన చలి గాలులతో నగర వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాత్రి వేళ్లల్లో చలి పంజా విసురుతుండడంతో గడప దాటేందుకు జనాలు భయంతో వణికిపోతున్నారు. మరిన్ని రోజులు చలితీవ్రత ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. గడిచిన వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. 

జనవరి 14 తరువాత క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. అయితే..తుపాన్ నేపథ్యంలో వాతావరణం మారిపోయింది. నగరంలో 12.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో వాతావరణం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పగటిపూట సైతం సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జనవరి 29వ తేదీ మంగళవారం 26.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. 
ఓ వైపు చలి చంపేస్తుంటే..నేనున్నా అంటూ స్వైన్ ఫ్లూ విహారం చేస్తోంది. ఈ వ్యాధి బారిన పడిన వారు కొంతమంది చనిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. నగర వాసులు స్వైన్ ఫ్లూపై అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.