Harassment For Videos : స్నేహితుడు కాదు కామాంధుడు.. న్యూడ్ వీడియోలు పంపాలని యువతికి వేధింపులు

ఈ రోజుల్లో ఎవరు మంచి వారో ఎవరు చెడ్డవారో తెలుసుకోవడం కష్టంగా మారింది. స్నేహితుడిలా నటిస్తూ దారుణాలకు ఒడిగడుతున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. కోరిక తీర్చాలని టార్చర్ పెడుతున్నారు. తాజాగా అలాంటి ఉదంతం మరొకటి వెలుగుచూసింది.

Harassment For Videos : స్నేహితుడు కాదు కామాంధుడు.. న్యూడ్ వీడియోలు పంపాలని యువతికి వేధింపులు

Harassment For Nude Videos

Harassment For Nude Videos : ఈ రోజుల్లో ఎవరు మంచి వారో ఎవరు చెడ్డవారో తెలుసుకోవడం కష్టంగా మారింది. స్నేహితుడిలా నటిస్తూ దారుణాలకు ఒడిగడుతున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. కోరిక తీర్చాలని టార్చర్ పెడుతున్నారు. తాజాగా అలాంటి ఉదంతం మరొకటి వెలుగుచూసింది. ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ తో స్నేహితుడిలా నటిస్తూ… నగ్న చిత్రాలను పంపాలంటూ బంధువును వేధిస్తున్న నిందితుడిని రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు.

కృష్ణాజిల్లా పామర్రు మండలంలోని రజకబజార్‌కు చెందిన పామర్తి సోమేంద్ర సాయి(25) ప్రైవేటు ఉద్యోగి. హైదరాబాద్ లో అతడి సమీప బంధువు ఉద్యోగం చేస్తోంది. ఆమెపై కన్నేసిన సోమేంద్ర.. సోషల్ మీడియాలో ఆమె ప్రొఫైల్‌ను వెతికాడు. ఆ తర్వాత ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపాడు. తెలిసిన వ్యక్తి కావడంతో ఆమెకు ఎలాంటి అనుమానం రాలేదు. వెంటనే అతడి రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేసింది. అలా ఆమెతో స్నేహం చేశాడు. ఆ తర్వాత సోమేంద్ర తన వక్రబుద్ధి బయటపెట్టాడు. ఓ యువతి ఫొటోతో నకిలీ అకౌంట్ క్రియేట్ చేశాడు. ఆ అకౌంట్ తో ఆ యువతికి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పెట్టాడు.

యువతి కావడంతో ఆమె వెంటనే యాక్సెప్ట్ చేసింది. అంతే, అప్పటినుంచి సోమేంద్ర టార్చర్ మొదలు పెట్టాడు. నగ్న చిత్రాలు పంపాలనీ, నగ్నంగా వీడియోకాల్‌ చేయాలని వేధించసాగాడు. కొన్నాళ్లు అతడి వేధింపులు భరించిన బాధితురాలు.. ఆ తర్వాత విసిగిపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించి నిందితుడిని పట్టుకున్నారు. స్నేహితుడి ముసుగులో తెలిసిన వ్యక్తే ఇలా వేధించాడని తెలిసి బాధితురాలు నివ్వెరపోయింది.

సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు పదే పదే చెబుతున్నారు. మరీ ముఖ్యంగా మహిళలు. సోషల్ మీడియాలో గుర్తు తెలియని, అజ్ఞాత వ్యక్తుల నుంచి సందేశాలను అస్సలు పట్టించుకోవద్దని సూచిస్తున్నారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని చెబుతున్నారు. ముందు వెనుక ఆలోచన చేయకుండా ఫ్రెండ్ షిప్ చేశామా? భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.