తొలి విడత పంచాయితీకి సర్వం సిద్ధం

  • Published By: madhu ,Published On : January 10, 2019 / 11:41 AM IST
తొలి విడత పంచాయితీకి సర్వం సిద్ధం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని మరో ఎన్నికల సమరానికి సమయం దగ్గర పడుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఈసీ సర్వం సిద్ధం చేస్తోంది. మూడు విడతలుగా ఎన్నికలు జరుగనున్నాయి. తొలి విడతగా జనవరి 21వ తేదీన పోలింగ్ జరగనుంది. నామినేషన్ విత్ డ్రా చేసుకోవడానికి జనవరి 13వ తేదీ ఆఖరి గడువుగా ఉంది. 
మొత్తం 12 వేల 785 గ్రామాలకు మొదటి విడతగా 4వేల 479 పంచాయతీలకు పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 27 వేల 940 మంది సర్పంచ్‌లు బరిలో నిలిచారు. నామినేషన్‌లు ఉపసంహరించుకోవడానికి జనవరి 13వ తేదీ ఆఖరి తేదీగా ఉంది. ఎంతమంది నామినేషన్‌లు ఉపసంహరించుకుంటారనేది ఆ రోజున తెలియనుంది. మరోవైపు పలు గ్రామాల్లో ఏకగ్రీవానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సర్పంచ్ పదవికి వేలం వేసినట్లు వార్తలు రావడంతో ఈసీ సీరియస్ అయ్యింది. వేలం వేయడం ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధమని..చట్ట విరుద్ధమని..సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.