GHMC కొరడా : 15 పబ్బులు సీజ్

హైదరాబాద్ నగరంలోని పబ్బులపై జీహెచ్ఎంసీ కొరడా ఝళిపించింది. పర్మిషన్ లేకుండా, కనీస వసతులు కల్పించకుండా నిర్వహిస్తున్న పబ్‌లపై జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకుంది.

  • Published By: veegamteam ,Published On : April 27, 2019 / 03:37 AM IST
GHMC కొరడా : 15 పబ్బులు సీజ్

హైదరాబాద్ నగరంలోని పబ్బులపై జీహెచ్ఎంసీ కొరడా ఝళిపించింది. పర్మిషన్ లేకుండా, కనీస వసతులు కల్పించకుండా నిర్వహిస్తున్న పబ్‌లపై జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకుంది.

హైదరాబాద్ నగరంలోని పబ్బులపై జీహెచ్ఎంసీ కొరడా ఝళిపించింది. పర్మిషన్ లేకుండా, కనీస వసతులు కల్పించకుండా నిర్వహిస్తున్న పబ్‌లపై జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకుంది. శుక్రవారం (ఏప్రిల్ 26,2019) రాత్రి జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లోని పలు పబ్‌లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఖైరతాబాద్‌ జోన్‌ కవిషనర్‌ ముషారఫ్‌ అలీ ఫారుఖి నేతృత్వంలో ఈ తనిఖీలు జరిగాయి. అనుమతి లేకుండా నిర్వహణ, వ్యాపార అనుమతి, పార్కింగ్‌ వసతి, అగ్నిమాపక ఏర్పాట్లు లేని 15 పబ్‌లను సీజ్‌ చేశారు. గతంలో కూడా తనిఖీలు నిర్వహించిన అధికారులు పలు పబ్బులను మూసేశారు. ట్రేడ్‌ లైసెన్స్‌ తీసుకోవాలని సూచించినా నిర్వాహకులు పట్టించుకోలేదు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకున్నారు.

వాహనాలను రోడ్డుపై నిలిపి ట్రాఫిక్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న పబ్బులను కూడా మూసివేశారు. జీహెచ్ఎంసీ సీజ్ చేసిన పబ్బుల్లో ఎక్కువగా జూబ్లీహిల్స్ పరిధిలోని రోడ్ నెంబర్ 36, 45 లోనివే. కొన్ని జూబ్లీహిల్స్ చెక్ పోస్టులో ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అగ్నిమాపక ఏర్పాట్లు లేకుండా జనావాసాల మధ్య నిర్వహిస్తున్న పబ్స్ ని మూసేశారు. ట్రేడ్ లైసెన్స్, పార్కింగ్ సౌకర్యం లేకుండానే కొన్ని పబ్బులను ఇళ్లలో నిర్వహిస్తున్నట్టు గుర్తించి అధికారులు షాక్ తిన్నారు. తనిఖీలు కొనసాగుతాయని జీహెచ్ఎంసీ అధికారులు చెప్పారు. పార్కింగ్ స్పేస్ లేకుండానే పబ్బులు నిర్వహిస్తున్నారని, దీని వల్ల ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని తమకు ఫిర్యాదులు అందాయన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని 2 నెలల్లో 3 సార్లు నోటీసులు పంపారు. పబ్ నిర్వహణకు సంబంధించి సరైన డాక్యుమెంట్లు ఇవ్వాలని అడిగారు. అయినా పబ్బుల నిర్వాహకులు పట్టించుకోలేదని, దీంతో సీజ్ చేశామని ఖైరతాబాద్‌ జోన్‌ కమిషనర్‌ ముషారఫ్‌ తెలిపారు. సరైన ఏర్పాట్లు చేసుకుని, డాక్యుమెంట్స్ సమర్పిస్తే మళ్లీ పబ్బులు నిర్వహించుకోవచ్చని అధికారులు చెప్పారు.

సీజ్ చేసిన పబ్బులు
Hard Cup Cafe
United Kitchens of India
Prost Brewpub
Chemistry
Celebrations
Karma