అలర్ట్ : హైదరాబాద్ కు గోదావరి నీళ్లు బంద్

  • Published By: veegamteam ,Published On : January 4, 2019 / 05:08 AM IST
అలర్ట్ : హైదరాబాద్ కు గోదావరి నీళ్లు బంద్

హైదరాబాద్ : నగరంలో రెండు రోజుల పాటు గోదావరి జలాల సరఫరా నిలిచిపోనుంది. బొమ్మకల్ – మల్లారం దారిలో గోదావరి  వాటర్ పైప్ లైన్ కు భారీ లీకేజ్ ఏర్పడటంతో నగరంలోని గోదావరి వాటర్ సరఫరా  నిలిచిపోనుంది. వాటర్ పైప్ లైన్ ను రిపేర్స్ చేయటం కోసం జనవరి 4, 5 తేదీలలో వాటర్ సరఫరా నిలిచిపోతుంది. ఈ క్రమంలో ఎర్రగడ్డ, యూసఫ్ గూడ, రహమత్ నగర్, ఎల్లారెడ్డిగూడ, శ్రీరాంనగర్, బంజారాహిల్స్, బోరబండ, ఎస్పీఆర్ హిల్స్, అల్లాపూర్, రాధికా సెక్షన్స్, డిఫెన్స కాలనీ, చాణక్యపురి, గౌతంనగర్, అల్వాల్, యూప్రాల్, చింతల్, షాపూర్ నగర్, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, కుత్బుల్లాపూర్ మున్సిపల్ సర్కిల్, ఎంఈఎస్ గన్ రాక్, త్రిశూల్ లైన్స్, రుద్రా నగర్ర, భాగ్యనరగర్, ఆల్విన్ కాలనీ, హస్మత్ పేట ఏరికాలకు నీటి సరఫరా నిలిచిపోతుందని జనమండలి ప్రకటించింది. రిపేర్స్ పూర్తి అయిన వెంటనే నీటి సరఫరా తిరిగి కొనసాగిస్తామని వాటర్ బోర్డ్ అధికారులు తెలిపారు. ఇప్పుడు ప్రకటించిన ప్రాంత వాసులు ఈ విషయాన్ని గమనించగలరు.