Hyderabad Metro: ఓల్డ్ సిటీకి మెట్రో రైల్‌పై అధికారుల కసరత్తు షురూ.. ఈ ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లు

ఈ మార్గంలో సాలార్‌జంగ్‌ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షంషీర్ గంజ్, ఫలక్ నుమాలో..

Hyderabad Metro: ఓల్డ్ సిటీకి మెట్రో రైల్‌పై అధికారుల కసరత్తు షురూ.. ఈ ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లు

Hyderabad Metro

Updated On : July 16, 2023 / 8:52 PM IST

Hyderabad Metro-Old City: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆదేశాల మేరకు ఓల్డ్ సిటీకి మెట్రో రైల్‌పై అధికారులు కసరత్తు ప్రారంభించారు. మెట్రో రైల్ సేవలను ఓల్డ్ సిటీ వరకు విస్తరించేందుకు త్వరగా చర్యలు చేపట్టాలని ఇటీవల కేసీఆర్‌ ఆదేశించినట్లు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ (KTR) తెలిపిన విషయం తెలిసిందే.

దీంతో ఎల్‌అండ్‌టీ, హెచ్‌ఎంఆర్‌ఎల్‌ అధికారులు ఎంజీబీఎస్‌-ఫలక్‌నుమా మార్గంలో మెట్రో రైలు కోసం ప్రణాళికలు వేస్తున్నారు. ఆ ప్రాజెక్టు అలైన్‌మెంట్‌ ఇంతకు ముందే ఖరారైంది. ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు 5.5 కిలోమీటర్ల మేర ఓల్డ్ సిటీ మెట్రో నిర్మాణం జరగనుంది. ఈ మార్గంలో సాలార్‌జంగ్‌ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షంషీర్ గంజ్, ఫలక్ నుమాలో స్టేషన్లు రానున్నాయి.

ఈ మార్గంలో మెట్రో కోసం 103 మతపరమైన నిర్మాణాలను తొలగించాల్సి ఉంది. అందులో మసీదులు, దేవాలయాలు, దర్గాలు, ఏడు స్మశాన వాటికలు వంటివి ఉన్నాయి. ఎక్కువ కట్టడాలను కూల్చకుండా 80 అడుగులకు మేరకు రోడ్డును విస్తరించడం ద్వారా ఈ మార్గంలో మెట్రో పనులు ప్రారంభించడానికి అధికారులు ప్రణాళికలు వేస్తున్నారు.

Shameerpet Gun Firing : శామీర్‌పేట కాల్పుల కేసు.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు