Hyderabad: చార్మినార్ వద్ద పోలీసుల తనిఖీలు… హోటళ్లు, దుకాణాల ముందు కూడా..

హైదరాబాద్ లోని చార్మినార్ వద్ద బాంబు పెట్టామని పోలీసులకు అగంతకులు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు బాంబ్ స్క్వాడ్ తో చార్మినార్ వద్దకు వెళ్లి తనిఖీలు చేశారు. చార్మినార్ వద్ద ఫుట్ పాత్ వ్యాపారాలను ఖాళీ చేయించి బాంబు కోసం తనిఖీలు చేశారు. హోటళ్లు, దుకాణాల ముందు కూడా తనిఖీలు చేశారు. అనుమానాస్పద వస్తువులను పరిశీలించారు. దాదాపు అర్ధగంట పాటు పోలీసులు తనిఖీలు చేశారు. చివరకు బాంబు లేదని నిర్ధారించినట్లు సమాచారం. దీనిపై పోలీసులు స్పందిస్తూ... తాము చేసింది సాధారణ తనిఖీలేనని అన్నారు. 

Hyderabad: చార్మినార్ వద్ద పోలీసుల తనిఖీలు… హోటళ్లు, దుకాణాల ముందు కూడా..

Hyderabad: హైదరాబాద్ లోని చార్మినార్ వద్ద బాంబు పెట్టామని పోలీసులకు అగంతకులు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు బాంబ్ స్క్వాడ్ తో చార్మినార్ వద్దకు వెళ్లి తనిఖీలు చేశారు. చార్మినార్ వద్ద ఫుట్ పాత్ వ్యాపారాలను ఖాళీ చేయించి బాంబు కోసం తనిఖీలు చేశారు. హోటళ్లు, దుకాణాల ముందు కూడా తనిఖీలు చేశారు. అనుమానాస్పద వస్తువులను పరిశీలించారు. దాదాపు అర్ధగంట పాటు పోలీసులు తనిఖీలు చేశారు. చివరకు బాంబు లేదని నిర్ధారించినట్లు సమాచారం. దీనిపై పోలీసులు స్పందిస్తూ… తాము చేసింది సాధారణ తనిఖీలేనని అన్నారు.

కాగా, కర్ణాటకలోని మంగళూరులో రెండు రోజుల క్రితం ఓ ఆటో రద్దీగా ఉండే రోడ్డులో పేలిపోయిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. అది ఉగ్ర చర్య అని కర్ణాటక పోలీసులు నిర్ధారించారు. ఆటో రిక్షాలో నుంచి పోలీసులు కాలిపోయిన ప్రెజర్ కుక్కర్ ను స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు.

ఇప్పటికే నిందితుడిని అరెస్టు చేసి, అతడికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని తేల్చారు. అక్కడ ఉగ్ర కలకలం చెలరేగిన వేళ చార్మినార్ వద్ద బాంబు ఉందంటూ ఫోన్ రావడం గమనార్హం.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..