నల్లబియ్యంతో హలీం: హైదరాబాద్‌లో కొత్త ప్రయోగం

  • Published By: vamsi ,Published On : May 7, 2019 / 01:50 PM IST
నల్లబియ్యంతో హలీం: హైదరాబాద్‌లో కొత్త ప్రయోగం

రంజాన్ మాసం వచ్చేసింది. ప్రతీ ఒక్కరూ ఎక్కువగా ఇప్పడు హలీం తింటారు. హైదరాబాద్‌ అంటే బిర్యానీ తర్వాత గుర్తొచ్చేది హలీం. హైదరాబాద్‌లో రంజాన్ మాసంలో అయితే సాయంత్రం అయితే చాలు రోడ్లు కిక్కిరిసిపోతాయి. హలీం తినేందుకు రోడ్లు మీద వరకు క్యూలు కడుతారు హలీం ప్రియులు. రంజాన్ మాసం ప్రారంభం కావడంతో హలీం బట్టీలను హోటళ్ల ముందు ఇప్పటికే సిద్ధం చేశారు నిర్వాహకులు. హైదరాబాద్‌లో ముఖ్యంగా పిస్తా హౌజ్‌ హోటల్‌ తయారీ చేసే హలీంకి ప్రాధాన్యత ఉంది. హలీంలో బేసిక్‌గా గోదుమలు, మటన్ ఎక్కువగా వాడేవారు. అయితే హోటళ్లు ప్రతీ సంవత్సరం కొత్త ప్రయోగాలు చేస్తున్నాయి.

ఇంతకుముందు గోదుమలు, బియ్యం వేసే స్థానంలో ఇప్పడు బ్లాక్‌ రైస్‌‌ను వాడుతున్నారు. ఒకప్పుడు చైనాలోని రాజ వంశీయులు మాత్రమే వీటిని తినేవారు. ఈశాన్య భారతంలో సాగుచేసే నల్ల బియ్యంను మణిపూర్‌లో ఎక్కువగా పండిస్తుంటారు. ఇవి మన దేశం నుండి విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు, అధిక పోషకాల కారణంగా వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంది. వీటి విలువ మార్కెట్‌లో ప్రస్తుతం రూ.300 వరకు ఉంది. అమేజాన్‌లో ప్రస్తుతం ఇవి దొరుకుతుండగా అలర్జీ, ఆస్తమా వంటి రోగాలకు ఉపశమనం కావడం, విటమిన్‌ బి ఉండడంతో కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. 

అలాగే గోధుమలు నేరుగా వేయకుండా గోధమ రవ్వను నీటిలో నానబెట్టి.. మంచి రుచి కోసం మినపప్పు, శనగపప్పు, కందిపప్పును కలుపుతున్నారు. మంచి అరుగుదలకు ఉపయోగపడే జిలకర్ర, షాజీరా, దాల్చిన చెక్క, తోక మిరియాలు, యాలకులు, వెల్లుల్లిలను యాడ్ చేస్తున్నారు. దాదాపు 8 గంటల పాటూ కట్టెల పొయ్యిపై వండుతూ హలీంను సిద్ధం చేస్తున్నారు. బాసుమతి బియ్యం స్థానంలో ఔషధ గుణాలున్న నల్ల బియ్యాన్ని హలీం తయారీలో వాడుతున్నారు పిస్తా హౌజ్ హోటళ్లవాళ్లు.