Revanth Reddy: రాష్ట్రపతి ఎన్నికల్లో మోదీ చెప్పినట్లు కేసీఆర్ వింటారు: రేవంత్ రెడ్డి

Revanth Reddy
Revanth Reddy: రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రధాని మోదీ చెప్పినట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ వింటారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ సొంత అభ్యర్థిని పెట్టి రాష్ట్రపతి ఎన్నికలకు పోతేనే మోదీని వ్యతిరేకించినట్లు అని ఆయన అన్నారు. రాజ్ భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మహిళా దర్బార్ పెట్టడాన్ని స్వాగతిస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు. నేడు ఆయన మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. రాష్ట్రంలో గవర్నర్ పాలన పెట్టినా బాగానే ఉంటుందని చెప్పారు.
Prophet remark row: భారత్ స్పందించిన తీరుపై ఇరాన్ సంతృప్తి
తెలంగాణ ప్రజలు క్రియాశీలక ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో క్రియాశీలక ప్రభుత్వం లేదని ఆయన విమర్శించారు. మహిళలపై ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించట్లేదని ఆయన అన్నారు. సెక్షన్ 8 ప్రకారం జంట నగరాలలో గవర్నర్‌కు సర్వాధికారాలు ఉన్నాయని ఆయన చెప్పారు. అవసరమైతే పరిపాలనను గవర్నర్ చేతిలోకి తీసుకోవచ్చని అన్నారు. సీఎంగా కేసీఆర్‌కు అధికారంతో పాటు బాధ్యత కూడా ఉంటుందని ఆయన చెప్పారు. అయితే, సీఎం భాధ్యతగా వ్యవహరించనప్పుడు రాజ్యాంగం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు.
Prophet row: నురూప్ శర్మతో పాటు మరో ఏడుగురిపై ఢిల్లీలో కేసులు
అలాగే, జూబ్లీహిల్స్ మైనర్ బాలిక రేప్ కేసులో వాడిన వాహనాల యజమానులకు కూడా శిక్షలు పడాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి రాష్ట్రంలో పాలననే కాకుండా.. అత్యాచారాలు కూడా పొత్తుల్లోనే చేస్తున్నట్లు ఉందని ఆయన విమర్శించారు. బాలిక రేప్ కేసులో పాత్రధారి అయిన వక్ఫ్ బోర్డు చైర్మన్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన నిలదీశారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కలిసే ఉన్నాయని ఆయన చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్ది అత్తా కోడళ్ల పంచాయితీ అని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఆర్థిక ఉగ్రవాది అని ఆయన విమర్శించారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లో అవగాహన కల్పించడానికి మాత్రమే ప్రకటనలు ఇవ్వాలని, కానీ అలా కాకుండా టీఆర్ఎస్ పార్టీ ప్రచారం కోసం కేసీఆర్ ప్రజాధనాన్ని ప్రకటనలకు ఖర్చుచేస్తున్నారని ఆయన ఆరోపించారు.
lokesh: లోకేశ్ జూమ్ మీటింగ్‌లోకి చొరబడ్డ కొడాలి నాని, వల్లభనేని వంశీ
దేశ వ్యాప్తంగా యాడ్స్ ఇవ్వాలంటే.. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాలని, ప్రభుత్వ డబ్బులను ఖర్చు పెట్టడం ఏంటి? అని రేవంత్ రెడ్డి నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాగానే ఆ యాడ్స్‌పై సమీక్ష చేస్తామని చెప్పారు. నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు ఎన్టీఆర్ పేరు తొలగించింది కేసీఆరే అని రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ వర్ధంతి, జయంతికి పూలదండలు వేస్తున్నారని ఆయన అన్నారు. కేసీఆర్ గతంలో వ్యవహరించిన తీరును ఎన్టీఆర్ అభిమానులు మర్చిపోతారా? అని ఆయన నిలదీశారు. ఇప్పుడు కేసీఆర్‌కు ఎన్టీఆర్ ఎందుకు గుర్తుకువచ్చారో? అని ప్రశ్నించారు. ప్రజలు ఇక కేసీఆర్‌ను నమ్మే పరిస్థితి లేదని ఆయన అన్నారు.