నేను లోకల్.. సంగతి చూస్తా : మెట్రో అధికారులకు కిషన్ రెడ్డి వార్నింగ్

హైదరాబాద్ మెట్రో అధికారులపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. JBS - MGBS మెట్రో రైలు ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించకపోవడంపై ఆగ్రహం

  • Published By: veegamteam ,Published On : February 15, 2020 / 10:12 AM IST
నేను లోకల్.. సంగతి చూస్తా : మెట్రో అధికారులకు కిషన్ రెడ్డి వార్నింగ్

హైదరాబాద్ మెట్రో అధికారులపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. JBS – MGBS మెట్రో రైలు ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించకపోవడంపై ఆగ్రహం

హైదరాబాద్ మెట్రో అధికారులపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. JBS – MGBS మెట్రో రైలు ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల వైఖరిని తప్పుపట్టారు. నా నియోజకవర్గంలో మెట్రో ప్రారంభమైతే.. నాకు సమాచారం ఇవ్వరా? అని ధ్వజమెత్తారు. మెట్రో ప్రాజెక్టులో కేంద్రం వాటా కూడా ఉందని.. అలాంటప్పుడు తమను అధికారులు ఎలా విస్మరిస్తారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేనిదే మెట్రో ప్రాజెక్టు నిర్మించారా అని అధికారులను నిలదీశారు. కేంద్రం ఇవ్వాల్సిన రూ.250 కోట్ల నిధుల గురించి ఇక ఢిల్లీకి రావొద్దని హెచ్చరించారు. రాజకీయ దురుద్దేశంతోనే తనకు ఆహ్వానం పంపలేదని అసహనం వ్యక్తం చేశారు.

కేంద్రం నిధులు కావాలి.. PM ఫొటో మాత్రం ఉండదు:
ప్రోటోకాల్ పాటించలదేని మెట్రో అధికారుల మీద సీరియస్ అయ్యారు. మొత్తం నా నియోజకవర్గంలోనే కార్యక్రమం నిర్వహిస్తే ట్రైన్ వెళ్తుంటే లోకల్ ఎంపీకి చెప్పరా..? అని మండిపడ్డారు. కేంద్రం నిధులు ఇవ్వాలి… పీఎం ఫోటో మాత్రం ఉండదని ఆయన ఫైర్ అయ్యారు. తనకు విప్ ఉందన్న కిషన్ రెడ్డి.. ఆరోజు అందరం పార్లమెంట్ లో ఉండాలని అన్నారు. నేను పార్లమెంటులో ఉంటే.. కార్యక్రమానికి ఒక్క రోజు ముందు చెప్తారా అని అధికారులను నిలదీశారు. రూ.1250 కోట్ల నిధులు మెట్రోకి ఇచ్చామన్న కిషన్ రెడ్డి.. ఇంకా రూ.200 కోట్లు ఇవ్వాలని గుర్తు చేశారు.

టీఆర్ఎస్ ఫంక్షన్‌లా చేస్తారా?
మెట్రో రైల్ రూట్ ప్రారంభం కూడా టీఆర్ఎస్ ఫంక్షన్ లాగా చేస్తారా అని అధికారుల మీద ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి. నా ఫోటో పెట్టకపోయినా పర్లేదు.. కనీసం పీఎం ఫోటో కూడా ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. మెట్రో రైల్ ప్రారంభోత్సవం సందర్భంగా చాలా చోట్ల హోర్డింగ్స్ పెట్టారు. కానీ ప్రధాని మోడీ ఫొటో ఎక్కడా లేదని కిషన్ రెడ్డి ఆగ్రహించారు. ఎల్ అండ్ టీ వాళ్లు ఇక ముందు ఎలాంటి ఫండ్ కేంద్రాన్ని అడగొద్దన్నారు. రూ.12 వందల కోట్లు ఇచ్చిన కేంద్రానికి కనీసం మర్యాద ఇవ్వలేదని, నిధులకు సంబంధించిన విషయంపై ఇక ముందు కేంద్రం దగ్గరికి రావొదని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిధులు ఎలా వస్తాయో చూస్తా:
హైదరాబాద్‌లోని దిల్ కుషా అతిథి గృహంలో శనివారం (ఫిబ్రవరి 15,2020) ఎల్ అండ్ టీ మెట్రో అధికారులతో మంత్రి కిషన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎల్‌ అండ్ టీ ఎండీ కేవీబీ రెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్ ఎంపీ నాయుడు, ఎల్‌టీఎంఆర్‌హెల్‌ఎల్ ఏకే షైనీ, హెచ్‌ఎంఎల్‌ఆర్ చీఫ్ ప్రాజెక్టు మేనేజర్ ఆనంద్ మోహన్, జీఎం రాజేశ్వర్ తదితరులు ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. మెట్రో రైలు ఎండీ ఎన్వీ ఎస్ రెడ్డి మాత్రం ఈ సమీక్షకు హాజరుకాలేదు. ఎల్ అండ్ టీ సంస్థకు ఇక భవనాలు, అనుమతులు ఏవీ ఇవ్వమని కిషన్ రెడ్డి హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఇక ఏమీ అడగొద్దని స్పష్టం చేశారు. ‘మెట్రో రైలు ప్రారంభం అనేది ఎల్ అండ్ టీకి ఇంటి పనో, వ్యక్తిగత వ్యవహారమో కాదు కదా.. నేను లోకల్ ఎంపీని.. నన్ను పిలవకుండా ఎలా చేస్తారు’ అని అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌ నగరానికి మణిహారంగా చెప్పుకుంటున్న మెట్రో రైలులో కీలకమైన జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గాన్ని సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 7న ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రొటోకాల్ ప్రకారం ఈ కార్యక్రమానికి సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఆహ్వానించాల్సి ఉంది. అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి.

Read Here>>వైద్యం చేస్తున్న 1700 డాక్టర్లకీ కరోనావైరస్.. చైనాకొచ్చిన కొత్త కష్టం!