ఎలక్ట్రిక్‌ బస్సుల ఆరోపణలపై స్పందించిన మేఘా

ఆర్టీసీ నష్టాలకు కారణం మేఘా సంస్థ అంటూ సాగుతున్న ప్రచారాన్ని ఆ సంస్థ తీవ్రంగా ఖండించింది. తెలంగాణ ఆర్టీసీకి తమ సంస్థ ఒలెక్ట్రా... కేవలం 40 బస్సులను మాత్రమే అద్దెకు

  • Published By: veegamteam ,Published On : October 15, 2019 / 07:51 AM IST
ఎలక్ట్రిక్‌ బస్సుల ఆరోపణలపై స్పందించిన మేఘా

ఆర్టీసీ నష్టాలకు కారణం మేఘా సంస్థ అంటూ సాగుతున్న ప్రచారాన్ని ఆ సంస్థ తీవ్రంగా ఖండించింది. తెలంగాణ ఆర్టీసీకి తమ సంస్థ ఒలెక్ట్రా… కేవలం 40 బస్సులను మాత్రమే అద్దెకు

ఆర్టీసీ నష్టాలకు కారణం మేఘా సంస్థ అంటూ సాగుతున్న ప్రచారాన్ని ఆ సంస్థ తీవ్రంగా ఖండించింది. తెలంగాణ ఆర్టీసీకి తమ సంస్థ ఒలెక్ట్రా… కేవలం 40 బస్సులను మాత్రమే అద్దెకు ఇచ్చిందని ప్రకటించింది. ఆర్టీసీలో 2 వేలకు పైగా అద్దె బస్సులు ఉండగా.. అందులో కేవలం 40 ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే తమవంటూ తెలిపింది. ఈ బస్సుల కారణంగానే ఆర్టీసీకి నష్టాలు వచ్చాయంటూ సాగుతున్న దుష్ప్రచారం సరికాదంది. ఆర్టీసీకి.. ఎలక్ట్రిక్ బస్సులను అద్దెకు ఇవ్వడం వెనుక జరిగిన సంఘటనలపై స్పష్టత ఇచ్చింది మేఘా.

అసలు ప్రజా రవాణాలో ఎలక్ట్రిక్‌ బస్సుల్ని తీసుకొచ్చింది ఎవరు? అందులో కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఎంత? బస్సుల ఎంపిక, టెండర్లకు సంబంధించిన నిబంధనలేంటి? ఇందులో మేఘా సంస్థకు వచ్చిన లాభమెంత? ఈ వ్యవహారంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా సంబంధముందా? ఇలా.. అసలు నిజాలేంటో తెలుసుకోకుండా… ఎలక్ట్రిక్‌ బస్సుల గురించి కనీస జ్ఞానం కూడా లేకుండా సాగుతున్న బురదజల్లే కార్యక్రమాన్ని మేఘా యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ఆర్టీసీ నుంచి తమకు రావాల్సిన బకాయిలు కూడా ఇంతవరకూ తమకు రాలేదంటూ వివరణ ఇచ్చింది ఒలెక్ట్రా.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజారవాణాలో డీజిల్‌ బస్సులకు బదులు ఎలక్ట్రిక్‌ బస్సులను వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 64 నగరాల్లో ఈ బస్సుల్ని వినియోగించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. వీటికి నిధుల్ని కూడా కేంద్ర ప్రభుత్వమే విడుదల చేస్తుంది. వారి మార్గదర్శక సూత్రాల ప్రకారం బస్సులు నడపాలి. ఇందుకోసం ఈ-టెండరింగ్ విధానాన్ని స్పష్టంగా కేంద్రం నిర్ణయించింది. బస్సుల అర్హత వాటి శక్తి సామర్థ్యాలు నిర్ణయించేందుకు ఉన్నతస్థాయి స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. అంతేకాదు బస్సుల ఎంపిక, ప్రోత్సాహకాలు, సేకరించే బస్సుల సంఖ్య లాంటి అంశాల్లో రాష్ట్రాలకు స్వేచ్ఛ లేదు. కేంద్రం నిర్ణయించిన ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాల్సిందే. కేంద్రం ఆదేశాలతో అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణలోనూ ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సుల్ని అద్దెకు తీసుకుంది. ఎలక్ట్రిక్ బస్సులను కొనే ఆర్థిక స్థోమత టీఎస్‌ ఆర్టీసీకి లేకపోవడంతో… 40 ఎలక్ట్రిక్‌ బస్సులను గోల్డ్‌ స్టోన్ సంస్థ నుంచి అద్దెకు తీసుకుంది. కొంతకాలం తర్వాత ఈ సంస్థలో వాటాలను మేఘా సంస్థ కొనుగోలు చేసింది. గోల్డ్‌ స్టోన్ పేరును ఒలెక్ట్రాగా మార్చింది.

తెలంగాణ ఆర్టీసీ దగ్గర మొత్తం 10వేల 460 బస్సులున్నాయి. అందులో 8వేల 320 మాత్రమే ఆర్టీసీ సొంత బస్సులు. మిగతా 2వేల 140 బస్సులు అద్దెవే. ఇందులో 40 ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే మేఘా పెట్టుబడులున్న ఒలెక్ట్రా సంస్థ నడుపుతోంది. ఈ 40 బస్సులతోనే ఒలెక్ట్రాకు కోట్లకు కోట్లు ఎలా వచ్చేస్తాయని ప్రశ్నిస్తున్నారు ఆ సంస్థ ప్రతినిధులు. దీనికితోడు 40 బస్సుల్ని నడపటం మొదలు పెట్టి 7 నెలలు కూడా పూర్తి కాలేదు. అంతకుముందు నుంచే ఆర్టీసీ ఏళ్ల తరబడిగా ప్రతి ఏటా వందల కోట్ల నష్టాలు… వేలకోట్ల అప్పుల భారంలో కూరుకుపోయింది. ఆర్టీసీ ఇబ్బందులకు కేవలం ఒలెక్ట్రా కారణమని ఎలా ప్రచారం చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.