ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు : టీఆర్ఎస్ 4, ఎంఐఎం 1

హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ విజయం లాంఛనమైంది. టీఆర్ఎస్ 4 స్థానాలను, మిత్రపక్షం ఎంఐఎం ఒక స్థానం

  • Published By: veegamteam ,Published On : March 12, 2019 / 12:50 PM IST
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు : టీఆర్ఎస్ 4, ఎంఐఎం 1

హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ విజయం లాంఛనమైంది. టీఆర్ఎస్ 4 స్థానాలను, మిత్రపక్షం ఎంఐఎం ఒక స్థానం

హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. టీఆర్ఎస్ అభ్యర్థుల విజయం లాంఛనమైంది. టీఆర్ఎస్ 4 స్థానాలను, మిత్రపక్షం ఎంఐఎం ఒక స్థానం గెలుచుకున్నాయి. టీఆర్ఎస్ నుంచి శేరి సుభాష్ రెడ్డి, యెగ్గె మల్లేష్, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ ఎన్నికయ్యారు. ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మొత్తం 5 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికలను బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే.
Read Also : మంగళగిరిలో నోట్లకట్టల కలకలం : కారులో రూ.80 లక్షలు

మంగళవారం(మార్చి 12) ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరిగింది. ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా టీఆర్ఎస్ బరిలోకి దిగింది. టీఆర్ఎస్ 4 స్థానాల్లో పోటీచేస్తూ.. ఒక స్థానాన్ని మిత్రపక్షం ఎంఐఎంకి కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ గూడూరు నారాయణ రెడ్డిని ఆరో అభ్యర్థిగా నిలబెట్టింది. దీంతో.. ఎన్నికలు అనివార్యమయ్యాయి. సంఖ్యా బలం లేకున్నా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ చివరి నిమిషంలో ఎన్నికల బరి నుంచి కాంగ్రెస్ తప్పుకుంది. దీంతో టీఆర్ఎస్, ఎంఐఎం అభ్యర్థుల గెలుపు లాంఛనమైంది.
Read Also : గాజువాక, పిఠాపురం : తేల్చుకోలేకపోతున్న పవన్ కళ్యాణ్