మృత్యుంజయుడు: బయటకు వచ్చిన ట్రైన్ డ్రైవర్

  • Published By: vamsi ,Published On : November 11, 2019 / 01:22 PM IST
మృత్యుంజయుడు: బయటకు వచ్చిన ట్రైన్ డ్రైవర్

హైదరాబాద్ కాచీగూడ రైల్వే స్టేషన్‌లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకోగా.. కేబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్‌ను ఎట్టకేలకు బయటకు తీసుకుని వచ్చింది రెస్క్యూ టీమ్. కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఆగివున్న పాసింజర్ ట్రైన్ వెనకనుంచి వస్తున్న మరో ఎంఎంటిఎస్ ట్రైన్ ఢీకొట్టగా ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇంజిన్ కేబిన్‌లో ఇరుక్కున్న ఎంఎంటీఎస్ డ్రైవర్ చంద్ర శేఖర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ క్రమంలోనే తనను కాపాడాలంటూ అర్తనాదలు చేశాడు డ్రైవర్.

దీంతో కేబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్‌ను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు అధికారులు. ఎనిమిది గంటలపాటు శ్రమించిన రెస్క్యూ టీమ్ ఎట్టకేలకు డ్రైవర్‌‌ను బయటకు తీసుకుని వచ్చింది. ఈ ఘటనలో 14 మందికి పైగా తీవ్ర గాయాలవగా..  రైల్వే జీఆర్పీ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. సిగ్నలింగ్ లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లుగా ఇప్పటికే ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు అధికారులు.

ఏలూరు ప్రాంతానికి చెందిన చంద్ర శేఖర్ ను ఎట్టకేలకు సురక్షితంగా బయటకు తీసుకుని వచ్చిన రెస్క్యూ టీమ్.. సమీపంలోని ఆస్పత్రికి తీసుకుని వెళ్లి వైద్యం చేయించాలని నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ముందుగా ప్రథమ చికిత్స అనంతరం అతనిని ఆస్పత్రికి తీసుకుని వెళ్తారు అధికారులు. ఉదయం నుంచి కాలు మాత్రమే కనిపించింది. అయితే చివరకు మృత్యుంజయుడిగా శేఖర్ బయటకు వచ్చాడు.