బై..బై..నైరుతి : రెండు రోజులు తెలంగాణాలో వర్షాలు

  • Published By: madhu ,Published On : October 7, 2019 / 03:20 AM IST
బై..బై..నైరుతి : రెండు రోజులు తెలంగాణాలో వర్షాలు

నైరుతి రుతపవనాలు బై బై చెప్పనున్నాయి. అక్టోబర్ 10వ తేదీ నుంచి ప్రారంభమౌతాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దాదాపు నెల రోజుల ఆలస్యంగా ఇవి వెనక్కి మళ్లుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇంత ఆలస్యంగా వెళ్లడం ఇదే ప్రథమమన్నారు. దేశంలో వర్షాలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ మాసంలో కూడా భారీ వర్షాలు కురుస్తండడంతో జనజీవనం స్తంభించడంతో పాటు ప్రాణనష్టం సంభవించింది. ఎంతో మంది నిరాశ్రులయ్యారు. 

మరోవైపు తెలంగాణ, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా కోస్తా కర్ణాటక వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు దగ్గర..  మరో ఇంటీరియర్ ఒడిశా ప్రాంతాల్లో సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ద్రోణులు కొనసాగుతున్నాయి.  దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురుస్తాయి. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశముందని  హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో రాగల 48 గంటల్లో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
Read More : స్ట్రైక్‌కు సర్కార్ స్ట్రోక్ : ఆర్టీసీలో కొత్త నియామకాలు