ఆర్టీసీనే ప్రధాన ఎజెండా : తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభం

  • Published By: chvmurthy ,Published On : November 2, 2019 / 10:07 AM IST
ఆర్టీసీనే ప్రధాన ఎజెండా : తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభం

తెలంగాణ  రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో శనివారం మధ్యాహ్నం ప్రారంభమయ్యింది.  ఈసమావేశంలో ప్రధానంగా ఆర్టీసి సమ్మెపైనే చర్చించే అవకాశం ఉంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించనున్నారు. ప్రయాణికులు అవసరాలను దృష్టిలో పెట్టుకుని పలు రూట్లలో ప్రయివేటు బస్సులు నడపేందుకు పర్మిట్లు ఇచ్చే అంశం కూడా చర్చకు రానుంది. 

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో జరుగుతున్న విచారణ అంశాలు కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నది. ఈ కేసులో శుక్రవారం విచారణ కొనసాగించిన హైకోర్టు.  నవంబర్  7 గురువారానికి వాయిదా వేసింది.  కోర్టు కేసు నేపథ్యంలో జరిగిన సమీక్ష సమావేశాల్లో వచ్చిన అంశాలను కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారని తెలిసింది.సమావేశ ఎజెండాలో 40కి పైగా ప్రతిపాదనలు చేర్చినట్లు తెలిసింది.

దీనితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ మంజూరు, తెలంగాణల మానవ హక్కుల కమీషన్ ఏర్పాటు, భాషాపండితులు, పీఈటీల కు స్కూలు అసిస్టెంట్లుగా ప్రమోషన్లు,  కొత్త జిల్లాల్లోఏర్పాటు చేసిన కోర్టుల్లో సిబ్బంది నియామకం తో పాటు పలు అభివృధ్ది అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.