ఖజానా ఫుల్ : 4 నెలల్లో 11 వేల కోట్ల మద్యం అమ్మకాలు

  • Published By: madhu ,Published On : April 28, 2019 / 04:21 AM IST
ఖజానా ఫుల్ : 4 నెలల్లో 11 వేల కోట్ల మద్యం అమ్మకాలు

తెలంగాణ రాష్ట్ర ఖజానాకు ప్రధాన వనరు ఏదీ అంటే..ఠక్కున ఎక్సైజ్ శాఖ అని చెబుతారు. అవును. ఈ శాఖ నుండే ఎక్కువ ఆదాయం వస్తోంది రాష్ట్ర ప్రభుత్వానికి. ఆబ్కారీ శాఖ టార్గెట్లు పెట్టుకుని దూసుకపోతోంది. ప్రజలను మద్యం మత్తులో ముంచుతోంది. ఈ శాఖకు ప్రస్తుతం కాసుల పంట పండడంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా గల్లుగల్లుమంటోంది. గత నాలుగు నెలల్లో సుమారు రూ. 11 వేల 452 కోట్ల అదనపు అమ్మకాలు జరిగాయి. ఇందులో రూ. 6 వేల 389 కోట్ల ఆదాయం వచ్చినట్లు..అధికారులు వెల్లడిస్తున్నారు. ఎందుకంటే వరుసగా ఎన్నికలు రావడమే ఇందుకు కారణం. 

తెలంగాణ శాసనసభ, పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. స్థానిక సంస్థల ఎన్నికలు, వేసవికాలం ముగిసే సరికి అమ్మకాలు మరింతగా పెరిగే ఛాన్స్ ఉందని శాఖాధికారులు అనుకుంటున్నారు. ఎన్నికల సందర్భంగా మద్యం అమ్మకాల్లో సుమారు రూ. 7వేల కోట్లు చీప్ లిక్కర్ ద్వారా వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం ఇప్పటికే రూ. 17 వేల 869 కోట్ల అమ్మకాలు జరిగినట్లు అంచనా.

ఈ అక్టోబర్ నాటికి రూ. 35వేల కోట్లకు మించి ఆదాయం వస్తుందని అంచనా వేసుకుంటున్నారు. మరో రెండు నెలలు విపరీతమైన ఎండలు ఉండడం మూలంగా బీర్ల అమ్మకాలు పెరుగుతాయని ఎక్సైజ్ శాఖ అధికారులు భావిస్తున్నారు. 2012-13లో 11 వేల 115 కోట్ల అమ్మకాలు జరిగితే..2014-15లోనే రూ. 13 వేల కోట్ల అమ్మకాలు జరిగాయి. గుడుంబా నిర్మూలన, మిడిల్ క్లాస్ మద్యం విపరీతంగా పెరగడంతో ఆగ్వ మద్యం (చీప్ లిక్కర్)పై మక్కువ చూపుతున్నారు.

జిల్లా మద్యం విక్రయాలు (రూ. కోట్లలో)
హైదరాబాద్ 2,656
మహబూబ్ నగర్ 11,197
రంగారెడ్డి 1,261
ఆదిలాబాద్ 1,629
వరంగల్ 709
నిజామాబాద్ 1,176
నల్గొండ 841
మెదక్ 773
కరీంనగర్ 654
ఖమ్మం 553