ప్రభుత్వాసుపత్రుల్లో ఓపీ సమయం పెంపు

  • Published By: madhu ,Published On : May 9, 2019 / 05:36 AM IST
ప్రభుత్వాసుపత్రుల్లో ఓపీ సమయం పెంపు

ప్రభుత్వాసుపత్రులకు వెళితే..చాంతాడంత క్యూ ఉంటది..మధ్యాహ్నం వరకే ఓపీ సమయం..ఎందుకని వెళ్లడం అనుకుంటున్నారా ? ఇక ఆ చింత మీకవసరం లేదు. ఎందుకంటే ఓపీ సమయాన్ని పెంచారు. రెండు గంటల పాటు పొడిగించాలని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఓపీ వేళలు ఉండేవి. దీనిని మధ్యాహ్నం 2 గంటల వరకు పొడిగించారు. ఈ మేరకు వైద్య విధాన పరిషత్ పరిధిలోని 110 ఆస్పత్రులకు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ యోగితారాణా ఆదేశాలు జారీ చేశారు. డయాగ్నస్టిక్స్ సమయాన్ని కూడా రెండు గంటల పాటు పెంచారు. రోగులకు ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు పరీక్షలు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.