తెలంగాణ మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు

  • Published By: veegamteam ,Published On : January 4, 2020 / 11:25 AM IST
తెలంగాణ మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు

తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ రిజర్వేషన్ల మొదటి దశ ప్రక్రియ పూర్తి అయింది. రాష్ట్రంలో మున్సిపాలిటీలవారిగా రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. రేపు వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. జవాభా కన్నా ఎక్కువ వార్డులు ఎస్టీలకు కేటాయించారు. ఇక మహిళా రిజర్వేషన్లు 50 శాతం కన్నా తగ్గే అవకాశం ఉంది. బీసీలకు 30 శాతం వరకు రిజర్వేషన్లు ఇవ్వనున్నారు. మున్సిపాలిటీ చట్టం ప్రకారమే ఎన్నికల సంఘం రిజర్వేషన్లు పూర్తి చేసింది.

 

నగరపాలక, మున్సిపాలిటీల్లో వార్డుల రిజర్వేషన్లు పూర్తి అయ్యాయి. ఆయా వర్గాల వారీగా వార్డు పదవుల రిజర్వేషన్లు పూర్తి చేశారు. 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లు రిజర్వేషన్లను ఫైనల్ చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ, ఎస్సీలకు వార్డు పదువుల్లో రిజర్వేషన్ల ప్రక్రియ చేశారు. 

 

మున్సిపాలిటీ చట్టం ప్రకారం ఈ సారి రిజర్వేషన్ అవకాశం వచ్చిన వారికి..మరోసారి అవకాశం రానుంది. రెండు సార్లు అవకాశం వచ్చే వీలుంది. వార్డులకు సంబంధించిన రిజర్వేషన్ల వివరాలను జిల్లా కలెక్టర్లకు పంపించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, వార్డుల వారిగా రిజర్వేషన్లను కలెక్టర్లు రేపు ప్రకటించనున్నారు.

 

ఎస్టీ జనాభా ఒక శాతానికి తక్కువగా ఉన్న కార్పొరేషన్లలో ఒక వార్డు ఎస్టీలకు రిజర్వ్ చేశారు. మున్సిపాలిటీల్లోనూ ఒక వార్డు ఎస్టీలకు రిజర్వ్ చేశారు. 50 శాతానికి మించకుండా బీసీలకు మిగతా రిజర్వేషన్లు ఖరారు చేశారు. రిజర్వేషన్ల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు పంపింది. రేపు వార్డుల వారీ రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. 

 

రిజర్వేషన్లపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. రిజర్వేషన్ల అంశంపై హైకోర్టుకు వెళ్లాయి. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లపై కొంత గందరగోళం ఉన్నది. అయితే ఈరోజు ఎన్నికల సంఘం రిజర్వేషన్లను ప్రకటించిన నేపథ్యంలో మేజర్ పార్టీ పూర్తి అయిందని అనుకోవచ్చు. నామినేషన్ల పర్వం, ఎన్నికలు జరగడమే తర్వాయి భాగంగా ఉంది. 

 

మొత్తంగా మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు అయిపోయాయి కాబట్టి..మేజర్ పార్ట్ పూర్తి అయిందనుకోవచ్చు. రేపు వార్డులకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియను ప్రకటించనున్నారు. జనవరి 7 వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. జనవరి 20న ఎన్నికలు జరుగనున్నాయి.