Tunnel Route In Hyderabad : KBR పార్క్ కింద 6.30 కి.మీటర్ల సొరంగ మార్గం నిర్మించే యోచనలో ప్రభుత్వం

విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ మహానగరంలో మరో అద్భుతం చోటుచేసుకోనుంది. ట్రాఫిక్‌‌ సమస్యకు చెక్ పెట్టడానికి పలు ఫ్లై ఓవర్లను నిర్మిస్తున్న ప్రభుత్వం నగరంలో సొరంగ మార్గం నిర్మించే యోచన చేస్తోంది.

Tunnel Route In Hyderabad : KBR పార్క్ కింద 6.30 కి.మీటర్ల సొరంగ మార్గం నిర్మించే యోచనలో ప్రభుత్వం

Tunnel Route In Hyderabad

Tunnel Route In Hyderabad : విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ మహానగరంలో మరో అద్భుతం చోటుచేసుకోనుంది. ట్రాఫిక్‌‌ సమస్యకు చెక్ పెట్టడానికి పలు ఫ్లై ఓవర్లను నిర్మిస్తున్న ప్రభుత్వం మరో అద్భుతమైన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. నగరంలోని జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్ వద్ద ఉన్న కేబీపార్క్ నుంచి 6.3కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని నిర్మించేయోచనలు ఉంది ప్రభుత్వం. పర్యాటకులను ఆకట్టుకునేలా జూబ్లీహిల్స్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ ఉద్యానవనం (కేబీఆర్‌ పార్కు) కింది నుంచి సొరంగం నిర్మాణానికి కసరత్తు మొదలైంది. టెన్నెల్ నిర్మాణం సాధ్యాఅసాధ్యాలపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది.

నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్‌కు సులువుగా రాకపోకల కోసం, పర్యాటకులను ఆకర్షిస్తున్న దుర్గం చెరువు కేబుల్‌ వంతెనకు కొనసాగింపుగా ఈ ప్రాజెక్టును తీసుకొచ్చింది ప్రభుత్వం. కేబుల్ బ్రిడ్జ్ ఎంతోమందిని ఆకట్టుకుంటోంది. ఇక టెన్నెల్ నిర్మిణం జరిగిదే హైదరాబాద్ లో మరో అద్భుతం ఆవిష్కరించబడినట్లే. ఈ టెన్నెల్ నిర్మాణ సాధ్యాసాధ్యాల పరిశీలనకు జీహెచ్‌ఎంసీ ఇటీవల టెండర్‌ నోటిఫికేషన్‌ ప్రకటించగా… ప్రి బిడ్‌ సమావేశానికి మూడు సంస్థలు హాజరయ్యాయి. అనుభవం, అర్హత ఆధారంగా వీటిలో ఓ సంస్థను సెలక్ట్ చేయనున్నారు. మే 2వ తేదీ వరకు బిడ్‌ దాఖలు చేసే అవకాశముంది. ఈ ప్రాజెక్ట్ వాస్తవ రూపం దాల్చితే దేశంలోనే రెండో అతి పెద్ద సొరంగం కానుంది.

జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.45 నుంచి కేబీఆర్‌ పార్కు ప్రవేశ ద్వారం వరకు 1.70 కిలోమీటర్లు, కేబీఆర్‌ ప్రధాన ప్రవేశ ద్వారం నుంచి ఎన్‌ఎఫ్‌సీఎల్‌ జంక్షన్ వరకు 2కిలోమీటర్లు. బంజారాహిల్స్‌ రోడ్‌ నం.12 టన్నెల్‌ జాయినింగ్‌ పాయింట్‌ 1.10 కి.మీ., అప్రోచ్‌ రోడ్లు- 1.50 కి.మీ. కలిపి మొత్తం 6.30 కి.మీ. మేర సొరంగం నిర్మించనున్నారు. నాలుగు వరుసలుగా చేపట్టబోయే ఈ నిర్మాణానికి సుమారు రూ.5వేల కోట్ల వ్యయం అవుతుందని జీహెచ్ఎంసీ అంచనా వేసింది. అయితే ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాల పరిశీలన నివేదిక వచ్చిన తర్వాత సమగ్ర నివేదిక రూపొందిస్తామని.. ఆ తర్వాతే నిర్మాణ వ్యయం స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు.

కేబీఆర్‌ జాతీయ పార్కు వద్ద చెట్లు, ఇతర జీవరాశులకు ఇబ్బంది కలగకుండా 100 అడుగుల లోతున అంటే 30 మీటర్లు సొరంగం నిర్మించాలన్నది జీహెచ్ఎంసీక ఆలోచన. ప్లాన్ ప్రకారం రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఆర్‌డీపీ) మొదటి దశలోనే ఐటీ కారిడార్‌- కోర్‌ సిటీకి అనుసంధానంగా ఉన్న కేబీర్‌ పార్క్‌ చుట్టూ వంతెనల నిర్మాణానికి ప్లాన్స్ రూపొందించారు. అయితే ఈ ప్రాజెక్టుతో పార్కులో జీవ వైవిధ్యం దెబ్బతినడంతో పాటు.. వేలాది చెట్లు తొలగించాల్సి వస్తుందని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ మార్గాలపై జీహెచ్‌ఎంసీ దృష్టి సారించింది. ఇప్పుడు సొరంగం నిర్మాణానికి ప్రతిపాదన చేసినందున ప్రభావిత ప్రాంతంలోని జీవ వైవిధ్యం, ఇళ్లు, నిర్మాణాలు, నీటి వనరులపై ప్రభావం, స్థానికుల అంగీకారం, పరిహారం, నిర్మాణం జాగ్రత్తలపై సాధ్యాసాధ్యాల పరిశీలనలో భాగంగా సమర్పించే నివేదికలో పరిష్కారం చూపించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే హైదరాబాద్ లో మరో ప్రత్యేక ఆకర్షణగా మారుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. పైగా ట్రాఫిక్ సమస్యలకు చెక్ పడుతుంది. ఏది ఏమైనా హైదాబాద్ విశ్వనగరంగా తీర్చి దిద్దటానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.