200-Year-Old Jackfruit Tree: తమిళనాడులో 200 ఏళ్ల పనసచెట్టు.. వీడియో వైరల్

భారత్ జీవవైవిధ్యానికి పెట్టింది పేరు. దేశంలో వివిధ సీజన్లలో ఎన్నో రకాల పండ్లు, కూరగాయలు పండుతాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పనస పండ్లు భారత్ లో బాగా పండుతాయి. కొన్ని రోజులుగా ఓ పనస పండ్ల చెట్టుకి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. తమిళనాడులోని కడలూరులో 200 ఏళ్లుగా ఓ పనస చెట్టు భారీగా పండ్లను అందిస్తోంది.

200-Year-Old Jackfruit Tree: తమిళనాడులో 200 ఏళ్ల పనసచెట్టు.. వీడియో వైరల్

200-Year-Old Jackfruit Tree

200-Year-Old Jackfruit Tree: భారత్ జీవవైవిధ్యానికి పెట్టింది పేరు. దేశంలో వివిధ సీజన్లలో ఎన్నో రకాల పండ్లు, కూరగాయలు పండుతాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పనస పండ్లు భారత్ లో బాగా పండుతాయి. కొన్ని రోజులుగా ఓ పనస పండ్ల చెట్టుకి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. తమిళనాడులోని కడలూరులో 200 ఏళ్లుగా ఓ పనస చెట్టు భారీగా పండ్లను అందిస్తోంది.

ఆ చెట్టుకి సంబంధించిన వీడియోను అపర్ణా కార్తికేయన్ అనే ట్విటర్ యూజర్ పోస్ట్ చేశారు. ‘‘ఈ జాక్ ఫ్రూట్ చెట్టుకి 200 ఏళ్లు. కడలూరులో ఇది ఓ వీఐపీ. ఈ చెట్టు ముందు నిలబడడాన్ని గౌరవప్రదంగా భావించవచ్చు. దీని చుట్టూ తిరగడాన్ని గర్వించవచ్చు’’ అని రాసుకొచ్చారు. ఆ చెట్టు చుట్టూ అనేక పనస పండ్లు ఉన్నాయి.

ఈ చెట్టు భారీగా అనేక కొమ్మలతో ఉంది. ఈ చెట్టు చుట్టూ తిరగడానికి దాదాపు 25 క్షణాలు పడుతుందని స్థానిక అధికారి ఒకరు తెలిపారు. దాదాపు 100 పనస పండ్లను ఈ చెట్టుకు చూడవచ్చు. పనసపండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ పండ్ల రేటు భారీగా ఉంటుంది.

Hormonal Acne : ఆడవారిలో మొటిమల సమస్య ఎందుకు వస్తుంది? సమస్య నుండి సులభంగా బయటపడటమెలా?