5G Spectrum Auction : 5G స్పెక్ట్రం వేలంతో కేంద్రానికి కాసుల పంట

5G స్పెక్ట్రం వేలం.. కేంద్ర ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించింది. స్పెక్ట్రమ్‌ అమ్మకాల ద్వారా 1.5 లక్షల కోట్లు ప్రభుత్వ ఖాజానాలోకి వచ్చిచేరాయి.

5G Spectrum Auction :  5G స్పెక్ట్రం వేలంతో కేంద్రానికి కాసుల పంట

5G Spectrum Auction :  5G స్పెక్ట్రం వేలం.. కేంద్ర ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించింది. స్పెక్ట్రమ్‌ అమ్మకాల ద్వారా 1.5 లక్షల కోట్లు ప్రభుత్వ ఖాజానాలోకి వచ్చిచేరాయి. మొత్తం స్పెక్ట్రమ్‌లో 71 శాతం అమ్మినట్టు కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. ఏడు రోజుల్లో మొత్తం 40 రౌండ్ల స్పెక్ట్రమ్‌ వేలం పాటలు జరిగాయి. ఇందులో టెలికం కంపెనీలు జోరుగా వేలం పాటలు పాల్గొన్నాయి. ఇదే సమయంలో గత ఏడాది బిడ్ల కంటే ఈసారి రికార్డు స్థాయిలో ఆదాయాలు నమోదైనట్లు తెలుస్తోంది.

వేలంలో.. రిలయన్స్‌ అధినేత ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్‌ జియో మొత్తం 88 కోట్ల రూపాయల విలువైన 5G స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసేందుకు బిడ్ చేసింది. భారతీ ఎయిర్‌టెల్ 43 వేల 84 కోట్లకు, వొడాఫోన్ ఐడియా 18 వేల 799 కోట్లకు, అదానీ గ్రూప్ కేవలం 212 కోట్ల స్పెక్ట్రమ్‌కు బిడ్‌ దాఖలు చేశాయి.

ఈ నెల 15 నాటికి ఈ స్పెక్ట్రమ్‌ కేటాయింపులు పూర్తవుతాయని.. కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్‌ మొత్తం 5Gతో దేశం మొత్తాన్ని కవర్‌ చేయడానికి సరిపోతుందని చెప్పారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌. ఈ నెల 15లోపు స్పెక్ట్రమ్ కేటాయింపు వేలం వేసిన మొబైల్ కంపెనీలు 7 వేల 500 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీని తరువాత, ప్రభుత్వం కంపెనీలకు స్పెక్ట్రమ్‌ను కేటాయిస్తుంది. కంపెనీలు సెప్టెంబర్-అక్టోబర్ నాటికి 5G సేవలను ప్రారంభించవచ్చు.

Also Read : Nama Nageswara Rao : ఎంపీ కుమారుడిని బెదిరించి రూ. 75 వేలు దోచుకున్న దుండగులు