Nama Nageswara Rao : ఎంపీ కుమారుడిని బెదిరించి రూ. 75 వేలు దోచుకున్న దుండగులు

ఎంపీ కుమారుడిని బెదిరించి అతని వద్ద నుంచి గుర్తు తెలియని దుండగులు రూ.75 వేల రూపాయలు ఆన్‌లైన్‌లో ట్రాన్సఫర్ చేయించుకున్న ఘటన వెలుగు చూసింది.

Nama Nageswara Rao : ఎంపీ కుమారుడిని బెదిరించి  రూ. 75 వేలు దోచుకున్న దుండగులు

Nama Nageswara Rao  :  ఎంపీ కుమారుడిని బెదిరించి అతని వద్ద నుంచి గుర్తు తెలియని దుండగులు రూ.75 వేల రూపాయలు ఆన్‌లైన్‌లో ట్రాన్సఫర్ చేయించుకున్న ఘటన వెలుగు చూసింది.

ఖమ్మం టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు కుమారుడు పృథ్వీరాజ్ గత నెల 30వ తేదీ సాయంత్రం కారులో టోలి చౌకి వైపు కారులో వెళుతున్నారు.  అక్కడ ఆయన కారును అడ్డగించిన ఇద్దరు వ్యక్తులు బలవంతంగా ఆయన కారులో ఎక్కారు. అనంతరం ఆయన్నుకత్తితో బెదిరించి కాసేపు కారులో ఊరంతా తిరిగారు.

కారు లోంచి పృధ్వీ దిగటానికి ప్రయత్నం చేయగా వారు కత్తితో బెదిరించారు. అనంతరం వారు అతని వద్ద నుంచి రూ. 75 వేల రూపాయలను ఆన్ లైన్ లో బదిలీ చేయించుకున్నారు. ఈ క్రమంలో పృధ్వీ చిన్నపాటి  ప్రమదాలు కూడా చేసినట్లు తెలిసింది. కారులో అటూ ఇటూ తిరుగుతూ పంజాగుట్ట వద్ద కారు దిగి పరారయ్యారు.  వెంటనే ఆయన పంజాగుట్ట పోలీసు స్టేషన్ కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read : Murder : ములుగు జిల్లాలో న్యాయవాది దారుణ హత్య