Murder : ములుగు జిల్లాలో న్యాయవాది దారుణ హత్య

ములుగు జిల్లాలో  నిన్న జరిగిన  న్యాయవాది హత్యపై  పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Murder : ములుగు జిల్లాలో న్యాయవాది దారుణ హత్య

Murder  : ములుగు జిల్లాలో  నిన్న జరిగిన  న్యాయవాది హత్యపై  పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. వరంగల్‌ జిల్లా కోర్టు న్యాయవాది, మల్లంపల్లి ఎర్రమట్టి క్వారీల యజమాని మల్లారెడ్డిని.. దుండగులు కత్తులతో పొడిచి చంపారు. ములుగు జిల్లా భూపాల్‌నగర్‌ బస్‌స్టేజీ సమీపంలో నిన్న రాత్రి ఈ హత్య జరిగింది. భూ వివాదం విషయమై ములుగు ఏఎస్పీ, ఎస్సైని కలిసి ఫిర్యాదు చేశారు మల్లారెడ్డి. ఆ తర్వాత తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి అక్కడ కూడా ఫిర్యాదు చేశారు. హన్మకొండకు తిరిగి వెళ్తుండగా.. వెంటాడిన ప్రత్యర్థులు మల్లారెడ్డిని హతమార్చారు.

మల్లారెడ్డి వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టిన దుండుగుల.. ఆయన్ను బలవంతంగా కారులోంచి బయటకు తీసుకొచ్చి రోడ్డుపక్కనే ఉన్న చెట్లపొదల్లోకి తీసుకెళ్లారు. కత్తితో మెడ, ఛాతి భాగాల్లో విచక్షణారహితంగా పొడవడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మల్లారెడ్డి మృతిచెందినట్లు నిర్ధారించుకున్న దుండగులు డ్రైవర్‌ను వదిలేసి పారిపోయారు. విషయం తెలుసుకున్న ములుగు పోలీసులు ఘటనా స్ధలాన్ని పరిశీలించారు. ఓ కత్తితోపాటు నిందితుడిదిగా అనుమానిస్తున్న రక్తం మరకలు ఉన్న చొక్కా, పెన్నును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హత్యకు భూతగాదాలే కారణంగా తెలుస్తోంది. మల్లారెడ్డి భూములకు సంబంధించి కొంతకాలంగా వివాదాలున్నాయి. ఇటీవల మల్లంపల్లి బ్రిడ్జి సమీపంలోని సుమారు ఐదెకరాల భూమికి సంబంధించి వివాదం తలెత్తినట్లు సమాచారం. మల్లారెడ్డి ములుగుకు వస్తారని ముందుగానే తెలుసుకున్న ప్రత్యర్థులు రెక్కీ నిర్వహించి.. హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.

Also Read : Tamil Film Industry : తమిళ సినీ నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు