పరీక్షలు లేకుండానే వాళ్లంతా పాస్ అంటోన్న స్టేట్ గవర్నమెంట్

పరీక్షలు లేకుండానే వాళ్లంతా పాస్ అంటోన్న స్టేట్ గవర్నమెంట్

Bihar education department: ఎటువంటి పరీక్షలు లేకుండానే ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులను పాస్ చేయాలని బీహార్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ నిర్ణయించుకుంది. కొవిడ్-19 సంక్షోభం కారణంగా కోల్పోయిన సమయం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది బీహార్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్.

మున్ముందు ప్రత్యేకంగా మూడు నెలల పాటు క్యాచ్ అప్ కోర్స్ క్లాస్ నిర్వహిస్తామని అన్నారు. అలా చేయడం వల్ల కోల్పోయిన ఏడాది సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని భావిస్తున్నారు. దాంతో పాటు కంప్లీట్ కాని స్కూల్ సిలబస్ క్యాచ్ అప్ కోర్స్ లో పూర్తి చేస్తామని తెలిపారు.

అంతవరకూ అన్ని బీహార్ ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకూ ఓపెన్ గానే ఉంటాయి. రాష్ట్ర ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ప్రైమరీ నుంచి ఐదో తరగతి క్లాస్ స్టూడెంట్స్‌కు మార్చి 1 నుంచి స్కూల్స్ ఓపెన్ గా ఉంటాయని చెప్పింది.