COVID-19 cases in India: దేశంలో కొత్తగా 4,272 కరోనా కేసులు నమోదు

దేశంలో కొత్తగా 4,272 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న 4,474 మంది కోలుకున్నట్లు వివరించింది. దేశంలో ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో 40,750 మంది చికిత్స తీసుకుంటున్నారని పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.35 శాతంగా ఉందని చెప్పింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.72 శాతంగా ఉందని పేర్కొంది.

COVID-19 cases in India: దేశంలో కొత్తగా 4,272 కరోనా కేసులు నమోదు

COVID-19 cases in India

COVID-19 cases in India: దేశంలో కొత్తగా 4,272 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న 4,474 మంది కోలుకున్నట్లు వివరించింది. దేశంలో ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో 40,750 మంది చికిత్స తీసుకుంటున్నారని పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.35 శాతంగా ఉందని చెప్పింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.72 శాతంగా ఉందని పేర్కొంది.

ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,40,13,999గా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. వారాంతపు పాజిటివిటీ రేటు 1.51 శాతంగా ఉందని చెప్పింది. ఇప్పటివరకు దేశంలో 218.17 కోట్ల వ్యాక్సిన్ డోసులు వినియోగించారని చెప్పింది. వాటిలో రెండో వ్యాక్సిన్ డోసులు 94.82 కోట్లు, ప్రికాషన్ డోసులు 20.88 కోట్లు ఉన్నాయని పేర్కొంది.

నిన్న దేశంలో 21,63,248 డోసుల వ్యాక్సిన్లు వేశారని చెప్పింది. ఇప్పటి వరకు దేశంలో 89.47 కోట్ల కరోనా పరీక్షలు చేశారని తెలిపింది. నిన్న దేశంలో 3,16,916 కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది.

“నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”.. https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw