COVID 19: దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. కొత్తగా 9,520 మందికి కరోనా

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 9,520 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి 12,875 మంది కోలుకున్నారని చెప్పింది. దేశంలో ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో 87,311 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్నట్లు వివరించింది. దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,37,83,788కు చేరిందని చెప్పింది.

COVID 19: దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. కొత్తగా 9,520 మందికి కరోనా

COVID 19

COVID 19: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 9,520 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి 12,875 మంది కోలుకున్నారని చెప్పింది. దేశంలో ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో 87,311 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్నట్లు వివరించింది. దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,37,83,788కు చేరిందని చెప్పింది.

కరోనా వల్ల దేశంలో ఇప్పటివరకు మొత్తం 5,27,597కు చేరినట్లు వివరించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.50 శాతంగా ఉన్నట్లు చెప్పింది. వారాంతపు పాజిటివిటీ రేటు 2.80 శాతంగా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 211.39 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారని వివరించింది.

వాటిలో రెండో డోసులు 94.15 కోట్లు, బూస్టర్ డోసులు 14.98 కోట్లు ఉన్నాయని తెలిపింది. నిన్న దేశంలో 25,86,805 డోసులు వినియోగించారని తెలిపింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 88.47 కోట్ల కరోనా పరీక్షలు చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న 3,81,205 కరోనా పరీక్షలు చేసినట్లు చెప్పింది. చాలా రోజుల తర్వాత కరోనా కొత్త కేసులు 10 వేలకు తక్కువగా నమోదు కావడం గమనార్హం.

Asia Cup 2022: ఇప్పటివరకు ఏ భారత క్రికెటరూ నెలకొల్పని రికార్డు రేపటితో కొహ్లీ సొంతం