Congress: 5న దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు
దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదలపై కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 5న దేశ వ్యాప్తంగా ఆందోళనలు తెలపాలని నిర్ణయం తీసుకుంది. అలాగే, అదే రోజున ప్రధాన మంత్రి హౌస్ ఘెరావ్ పేరిట పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని తెలిపింది. దీన్ని విజయవంతం చేసే బాధ్యతలను తమ వర్కింగ్ కమిటీ సభ్యులకు కాంగ్రెస్ అప్పగించింది. అలాగే, అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, పార్టీ సీనియర్ నేతలు ఆందోళనల్లో పాల్గొనాలని చెప్పింది.

Goa Congress
Congress: దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదలపై కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 5న దేశ వ్యాప్తంగా ఆందోళనలు తెలపాలని నిర్ణయం తీసుకుంది. అలాగే, అదే రోజున ప్రధాన మంత్రి హౌస్ ఘెరావ్ పేరిట పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని తెలిపింది. దీన్ని విజయవంతం చేసే బాధ్యతలను తమ వర్కింగ్ కమిటీ సభ్యులకు కాంగ్రెస్ అప్పగించింది. అలాగే, అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, పార్టీ సీనియర్ నేతలు ఆందోళనల్లో పాల్గొనాలని చెప్పింది.
మరోవైపు, ధరల పెరుగుదలపై సోమవారం లోక్సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. మంగళవారం రాజ్యసభలో దీనిపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. నిరుద్యోగం, ధరల పెరుగుదలపై కొన్ని రోజులుగా ప్రతిపక్షాలు లోక్సభ, రాజ్యసభలో డిమాండ్ చేస్తున్నాయి. ఈ కారణంగా ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. నిరుద్యోగం, ధరల పెరుగుదలపై కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తోంది.
Kerala: యూట్యూబ్లో చూసి మద్యం తయారు చేసిన బాలుడు.. తాగి ఆసుపత్రిలో చేరిన అతడి స్నేహితుడు