Bharat Jodo Yatra: ప్రజల సహకారం చూసి నా కళ్ల వెంట నీరు కారింది: హిమపాతాన్ని లెక్క చేయకుండా రాహుల్ ప్రసంగం
భారత్ జోడో యాత్రతో ప్రజల సహకారం చూసి తన కళ్ల వెంట నీరు కారిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్ర ముగిసిన నేపథ్యంలో శ్రీనగర్ లో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. హిమపాతాన్ని సైతం లెక్కచేయకుండా ఆయన ప్రసంగించారు. తన పాదయాత్రకు సహకరించిన వారికి కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు.

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రతో ప్రజల సహకారం చూసి తన కళ్ల వెంట నీరు కారిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్ర ముగిసిన నేపథ్యంలో శ్రీనగర్ లో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. హిమపాతాన్ని సైతం లెక్కచేయకుండా ఆయన ప్రసంగించారు. తన పాదయాత్రకు సహకరించిన వారికి కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు.
తాను ఒక దశలో తన పాదయాత్రను పూర్తి చేయగలనా? అని అనుకున్నానని చెప్పారు. తీవ్ర చలిని కూడా పట్టించుకోకుండా ప్రజలు తన యాత్రలో పాల్గొన్నారని తెలిపారు. ప్రజల నుంచి మద్దతు రాకపోతే ఏదీ సాధ్యం కాదని చెప్పారు.
”నలుగురు చిన్నారులు నా వద్దకు వచ్చారు. వారు యాచిస్తూ కడుపునింపుకుంటున్నారు. వారు దుస్తులు కూడా వేసుకోలేదు. వారు చలికి వణికిపోయారు. వారికి తినడానికి ఆహారం కూడా దొరకడం లేదనుకుంటా. వారు స్వెట్టర్లు, జాకెట్లు వేసుకోవడం లేదు.. దీంతో నేను కూడా వాటిని వేసుకోకూడదని అనుకున్నాను” అని రాహుల్ గాంధీ చెప్పారు.
చాలా మంది మహిళలు తమ బాధలను తనతో చెప్పుకున్నారని అన్నారు. కశ్మీర్ కు మళ్ళీ రాష్ట్ర హోదా ఇస్తామని ప్రకటించారు. పాదయాత్ర తనకు ఎన్నో పాఠాలను నేర్పిందని చెప్పారు. తన పాదయాత్రలో తాను అన్ని వర్గాల ప్రజలను కలిశానని అన్నారు. కాగా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ… ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ పేద ప్రజలను పేదలుగానే ఉంచుతూ ధనికులను మరింత ధనికులుగా చేయాలని అనుకుంటున్నాయని చెప్పారు.
LIVE: Public Meeting | Sher-e-Kashmir Stadium | Srinagar, J&K | #BharatJodoYatra https://t.co/f0PPgx0UM8
— Bharat Jodo (@bharatjodo) January 30, 2023
China’s PLA: సైనిక శక్తిని మరింత పెంచుకునేందుకు చైనా కీలక నిర్ణయాలు?