Vande Bharat Express: దక్షిణాదిన ప్రారంభం కానున్న తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

దేశంలో ప్రారంభించిన నాలుగో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఇది. నవంబరు 10న దక్షిణాదిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రారంభమవుతుంది. చెన్నై-బెంగళూరు-మైసూరు మధ్య ఈ రైలు సేవలు అందించనుంది. మొత్తం 483 కిలోమీటర్ల మేర ఇది నడుస్తుంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే దేశంలో మూడో, నాలుగో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించారని విశ్లేషకులు అంటున్నారు. అలాగే, వచ్చే ఏడాది కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఇప్పుడు చెన్నై-బెంగళూరు-మైసూరు మధ్య వందే భారత్ రైలును ప్రారంభిస్తున్నారని చెబుతున్నారు.

Vande Bharat Express: దక్షిణాదిన ప్రారంభం కానున్న తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

Vande Bharat Express: దక్షిణాదిన తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రారంభం కానుంది. దేశంలో ప్రారంభం అవుతున్న ఐదవ వందే భారత్ ట్రైన్ ఇది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్‌లో నిన్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను పచ్చ జెండా ఊపి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ రైలు అంబ్ అందౌరా నుంచి న్యూఢిల్లీ వరకు నడుస్తుంది. దేశంలో ప్రారంభించిన నాలుగో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఇది. నవంబరు 10న దక్షిణాదిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రారంభమవుతుంది. చెన్నై-బెంగళూరు-మైసూరు మధ్య ఈ రైలు సేవలు అందించనుంది.

మొత్తం 483 కిలోమీటర్ల మేర ఇది నడుస్తుంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే దేశంలో మూడో, నాలుగో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించారని విశ్లేషకులు అంటున్నారు. అలాగే, వచ్చే ఏడాది కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఇప్పుడు చెన్నై-బెంగళూరు-మైసూరు మధ్య వందే భారత్ రైలును ప్రారంభిస్తున్నారని చెబుతున్నారు.

అత్యాధునిక వందే భారత్‌ రైళ్లను పూర్తిగా భారత్ లోనే తయారు చేస్తున్నారు. ఈ సెమీ-హై-స్పీడ్ ట్రైన్లలో ఆటోమేటిక్ డోర్లు, ఏసీ చైర్ కార్ వంటివి ఉంటాయి. ఈ రైళ్లను తక్కువ విద్యుత్తు వినియోగించుకునేలా అభివృద్ధి చేస్తున్నారు. స్టీల్‌తో కాకుండా తక్కువ బరువు ఉండే అల్యూమినియంతో వీటిని రూపొందిస్తున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..