Gehlot asks VP Dhankhar: ‘టఫ్ లేడీ మమతా బెనర్జీ ఆ ఎన్నికలకు దూరంగా ఉండేలా ఏ మ్యాజిక్ చేశారు?’ అంటూ ఉప రాష్ట్రపతిని ప్రశ్నించిన సీఎం గహ్లోత్

గహ్లోత్ మాట్లాడుతూ... పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా మూడేళ్లు కొనసాగిన జ‌గ్‌దీప్ ధ‌న్‌క‌ర్ కు ఆ సమయంలో సీఎం మమతా బెనర్జీకి మధ్య జరిగిన విభేదాలను గుర్తుచేశారు. వారిద్దరి మధ్య చోటుచేసుకున్న పరిణామాలు దేశవ్యాప్తంగా అప్పట్లో చర్చనీయాంశంగా మారేవని చెప్పారు. అయితే, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో అందులో మమతా బెనర్జీ పార్టీ ఓటింగ్ లో పాల్గొనకుండా ఏ మ్యాజిక్ చేశారని ఆయన ప్రశ్నించారు. ఆ రహస్యం ఏంటో చెప్పాలని ఆయన కోరారు. మీరు నా కన్న పెద్ద మెజీషియనా? అని ప్రశ్నించారు.

Gehlot asks VP Dhankhar: ‘టఫ్ లేడీ మమతా బెనర్జీ ఆ ఎన్నికలకు దూరంగా ఉండేలా ఏ మ్యాజిక్ చేశారు?’ అంటూ ఉప రాష్ట్రపతిని ప్రశ్నించిన సీఎం గహ్లోత్

Gehlot asks VP Dhankhar

Gehlot asks VP Dhankhar: ‘టఫ్ లేడీ మమతా బెనర్జీ ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండేలా ఏ మ్యాజిక్ చేశారు?’ అంటూ ఉప రాష్ట్రపతి జ‌గ్‌దీప్ ధ‌న్‌క‌ర్ ను రాజస్థాన్ సీఎం గహ్లోత్ ప్రశ్నించారు. ఉప‌ రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో తృణ‌మూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ ఓటింగ్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. విప‌క్షాల త‌ర‌పున కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మార్గ‌రెట్ అల్వా పోటీ చేస్తారని ప్రకటన చేసేముందు టీఎంసీని సంప్రదించలేదంటూ మమతా బెనర్జీ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ విషయంపైనే అశోక్ గహ్లోత్ చమత్కారంగా మాట్లాడారు. నిన్న రాజస్థాన్ అసెంబ్లీలో జ‌గ్‌దీప్ ధ‌న్‌క‌ర్ ప్రసంగిస్తూ.. గతంలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ తాను ఓ మ్యాజిక్ చేశానని అన్నారు. అనంతరం గహ్లోత్ మాట్లాడుతూ… పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా మూడేళ్లు కొనసాగిన జ‌గ్‌దీప్ ధ‌న్‌క‌ర్ కు ఆ సమయంలో సీఎం మమతా బెనర్జీకి మధ్య జరిగిన విభేదాలను గుర్తుచేశారు. వారిద్దరి మధ్య చోటుచేసుకున్న పరిణామాలు దేశవ్యాప్తంగా అప్పట్లో చర్చనీయాంశంగా మారేవని చెప్పారు.

అయితే, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో అందులో మమతా బెనర్జీ పార్టీ ఓటింగ్ లో పాల్గొనకుండా ఏ మ్యాజిక్ చేశారని ఆయన ప్రశ్నించారు. ఆ రహస్యం ఏంటో చెప్పాలని ఆయన కోరారు. మీరు నా కన్న పెద్ద మెజీషియనా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం గహ్లోత్ కాంగ్రెస్ అధ్యక్షుడి పోటీ రేసులో ఉన్న విషయం తెలిసిందే.

Protests outside Hindu temple: ఇంగ్లండ్‌లోని హిందూ ఆలయం వద్ద తీవ్ర కలకలం.. వీడియోలు వైరల్