Job lost: 7 ఏళ్లలో తొలిసారి 20 ని’ లేటు.. ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి

Job lost: 7 ఏళ్లలో తొలిసారి 20 ని’ లేటు.. ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి

Job lost: చాలా సంస్థల్లో ఉద్యోగుల టైమింగ్ చాలా స్టిక్ట్‭గా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫీసు టైంకు రావాల్సిందే. ఉద్యోగులు కూడా ఈ టైమింగ్స్ ఫాలో అవ్వాలనే అనుకుంటారు. అయితే అనుకోని సందర్భాల్లో కొన్నిసార్లు ఆఫీసుకు రావడం కాస్త ఆలస్యం కావచ్చు. కొన్ని సంస్థల్లో అయితే సమయం వెసులుబాటు ఉంటుంది. తరుచూ లేట్ అయితే పరిస్థితి వేరు కానీ రోజూ సమయానికి వస్తూ ఎప్పుడో ఒకసారి ఆలస్యమయ్యేదానికి మాత్రం పెద్దగా పట్టింపు ఉండదు. అలాంటిది ఒక వ్యక్తి ఏడేళ్లలో మొట్టమొదటిసారి 20 నిమిషాలు ఆఫీసుకు ఆలసస్యంగా వచ్చి ఉద్యోగం కోల్పోయాడు. పేరు వివరాలు తెలియవు కానీ సోషల్ మీడియాలో కనిపించిన పోస్ట్ ఇది. బాధితుడి సోషల్ మీడియా పోస్ట్‭ చూసి నెటిజెన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కొంత మంది ఉద్యోగులైతే అతడిని ఉద్యోగంలోకి తీసుకునేంత వరకు తాము ఆఫీసుకు రామని చెప్తున్నారు.

గుర్తు తెలియని ఈ వ్యక్తి పోస్ట్ రెడిట్‭లో కనిపించింది. తాను ఒక సంస్థలో ఏడేళ్లకు పైగా పని చేస్తున్నానని, అయితే ఇన్నేళ్లలతో తొలిసారి ఆఫీసుకు 20 నిమిషాలు ఆలస్యంగా వచ్చానని, అందుకు తన ఉద్యోగాన్ని మూల్యంగా చెల్లించుకున్నానని వాపోయాడు. తనను తిరిగి ఉద్యోగంలోకి తీసుకునే వరకు మిగతా సిబ్బంది ఆందోళన చేపట్టాలని విజ్ణప్తి చేశాడు. ఈ పోస్ట్ చూసిన నెటిజెన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత చిన్న సాకు చూపి ఉద్యోగాన్ని తొలగించడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు కారణం ఇది కాదని, అతడిని ఉద్యోగం నుంచి తొలగించే ఉద్దేశంతో ఇదో కుంటి సాకు చూపించారని మరికొందరు మండిపడుతున్నారు. అతడిని ఉద్యోగంలోకి తిరిగి తీసుకునే వరకు తనతో పాటు తన సహ ఉద్యోగులు ఆఫీసుకు లేటుగా రావాలని నిర్ణయించుకున్నట్లు ఓ నెటిజెన్ తెలిపారు. ఇప్పటికే 79 వేల మంది ఉద్యోగులు అతడికి మద్దతుగా నిలిచారు. ఈ సంఖ్య ఇంకా క్రమంగా పెరుగుతూ పోతోంది.

Government Jobs : కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 10 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీ