Pakistan: పాక్‌లో బోటు ప్రమాదం.. విహార యాత్రకు వెళ్లిన పది మంది చిన్నారులు మృతి

స్థానిక మదర్సాకు చెందిన 25 మంది వరకు విద్యార్థులు ఆదివారం సెలవు దినం కావడంతో ఒక డే ట్రిప్ కోసం వెళ్లారు. ఖైబర్ పక్తుంఖ్వా ప్రావిన్స్‌కు చెందిన తండా దామ్ లేక్‌లో పిల్లలంతా ఒక చిన్న బోటులో విహారానికి వెళ్లారు. ఈ క్రమంలో నదిలోకి వెళ్లిన తర్వాత పడవ తిరగబడింది.

Pakistan: పాక్‌లో బోటు ప్రమాదం.. విహార యాత్రకు వెళ్లిన పది మంది చిన్నారులు మృతి

Pakistan: పాకిస్తాన్‌లో ఆదివారం ఒక బస్సు లోయలో పడి 40 మందికిపైగా మరణించిన ఘటన మరువక ముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఒక పడవ బోల్తా పడిన ఘటనలో 10 మంది చిన్నారులు మరణించారు. ఈ ఘటన కూడా ఆదివారమే జరిగింది.

Gujarat: పంచాయత్ జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ పేపర్ లీక్.. పరీక్ష రద్దు చేసిన ప్రభుత్వం

స్థానిక మదర్సాకు చెందిన 25 మంది వరకు విద్యార్థులు ఆదివారం సెలవు దినం కావడంతో ఒక డే ట్రిప్ కోసం వెళ్లారు. ఖైబర్ పక్తుంఖ్వా ప్రావిన్స్‌కు చెందిన తండా దామ్ లేక్‌లో పిల్లలంతా ఒక చిన్న బోటులో విహారానికి వెళ్లారు. ఈ క్రమంలో నదిలోకి వెళ్లిన తర్వాత పడవ తిరగబడింది. దీంతో విద్యార్థులంతా నీళ్లలో మునిగిపోయారు. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టారు. 11 మందిని రక్షించారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. మరణించిన చిన్నారులంతా 7-14 సంవత్సరాల లోపు వయసు వాళ్లే.

Karnataka: అంతరించిపోతున్న జీవుల అక్రమ రవాణా.. ఎయిర్‌పోర్టులో 18 జీవుల స్వాధీనం.. నిందితుల అరెస్ట్

పాకిస్తాన్‌లో బోటు ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. అక్కడి వాళ్లలో ఎక్కువ మందికి ఈత రాకపోవడం దీనికి ఒక ప్రధాన కారణం. ఆడపిల్లలపై అనేక ఆంక్షలు ఉండటం వల్ల అమ్మాయిల్లో దాదాపు ఎవరికీ ఈత నేర్చుకునే అవకాశం లేదు. పడవ ప్రమాదాల్లో అక్కడ మహిళలుంటే వాళ్లను వాళ్లు రక్షించుకునే అవకాశం ఎంత మాత్రం ఉండదు. బోటు ప్రమాద ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.