అమ్మమ్మ కోసం రెండు దేశాలు దాటి 2,800 కి.మీటర్లు నడిచి వెళ్లిన మనుమడు..

  • Published By: nagamani ,Published On : October 3, 2020 / 05:00 PM IST
అమ్మమ్మ కోసం రెండు దేశాలు దాటి 2,800 కి.మీటర్లు నడిచి వెళ్లిన మనుమడు..

10 year old walks 280 km from sicily to london to meet grandmother in lockdow : నేటి చిన్నారులు అమ్మమ్మలు..నాయనమ్మలకు దూరంగా పెరుగుతున్నారు. తల్లిదండ్రుల ఉద్యోగాలు..వారి చదువులు..ర్యాంకులు..ఇలా అమ్మమలు..నాయనమ్మల వాత్సల్యాలకు దూరంగా పెరుగుతున్నారు. మనుమలతో ఆడుకోవాలని..వారికి కథలు చెప్పాలని ఆరాటపడి ఆశపడే అమ్మమ్మా నాయనమ్మల ఆకాంక్షలు నెరవేరటంలేదు.

<script async src=”https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js”></script>
<ins class=”adsbygoogle”
style=”display:block; text-align:center;”
data-ad-layout=”in-article”
data-ad-format=”fluid”
data-ad-client=”ca-pub-6458743873099203″
data-ad-slot=”1057226020″></ins>
<script>
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>

కానీ వారి మనస్సు మాత్రం వారి కోసం తపనపడుతునే ఉంటుంది. కానీ చిన్నారులకు వారి ప్రేమను అర్థం చేసుకునేంత వయస్సు ఉండదు. కానీ ఓ పిల్లాడు మాత్రం తన అమ్మమ్మ చూడాలనే కోరికతో ఏకంగా 2 నెలల పాటు 2వేల 800ల కిలోమీటర్ల దూరం నడిచి అమ్మమ్మ దగ్గరకు చేరుకున్న మనుమడు. ఆ మనుమడి సుదీర్ఘ ప్రయాణం గురించి తెలుసుకుందాం..

ఇటలీలోని సిసిలీ ప్రాంతంలోని పలెర్మో చెందిన రోమియో కాక్స్ అనే 10 ఏళ్ల బాలుడికు అమ్మమ్మ అంటే ఎంతో ఇష్టం. కాక్స్ అమ్మమ్మ బ్రిటన్ లోని లండన్‌లో ఉంటోంది. కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో స్కూలుకు వెళ్లేపనిలేదు. ఇంట్లో ఒంటరిగా ఉండటంతో అమ్మమ్మ కథలన్నీ గుర్తుకొచ్చాయి. అమ్మమ్మతో ఆడుకున్న ఆటలు గుర్తుకొచ్చి అమ్మమ్మ దగ్గరకు వెళ్లాలని ఆశపడ్డాడు. అదే మాట అమ్మానాన్నల్ని అడిగాడు.

<script async src=”https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js”></script>
<ins class=”adsbygoogle”
style=”display:block; text-align:center;”
data-ad-layout=”in-article”
data-ad-format=”fluid”
data-ad-client=”ca-pub-6458743873099203″
data-ad-slot=”1057226020″></ins>
<script>
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>పిల్లాడి కోరిక తీర్చాలను అనుకున్నా రవాణా సౌకర్యం లేదు..దీంతో లాక్‌డౌన్ అయిపోయాక..ట్రాన్స్ పోర్ట్ ఫెసిలిటీ వస్తుందని కదా..అప్పుడు వెళదామని చెప్పేవారు. కానీ రోమియో వినలేదు. అమ్మమ్మ దగ్గరకు వెళ్లాల్సిందేనంటూ పట్టుపట్టాడు. అమ్మానాన్నలు ఎంత నచ్చజెప్పినా రోమియో వినలేదు. మీరు తీసుకెళ్లకపోతే నేనే వెళ్లిపోతానని బెదిరించాడు. దీంతో వాళ్లు కొడుకు పట్టుదల గురించి తెలిసిన వాళ్లు భయపడిపోయారు. దీంతో తండ్రీ కొడుకులు కలిసి ఓ ప్లాన్ వేశారు. నడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

అలా జూన్ 20న తండ్రి ఫిల్ తో  కలిసి రోమియో నడక ప్రారంభించాడు. అలా వారి నడక ప్రయాణం ఇటలీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల మీదుగా రెండు నెలల పాటు నడిచి సెప్టెంబరు 21న యూకేలోని లండన్ చేరుకున్నారు. కరోనా నిబంధనల ప్రకారం లండన్ అధికారులు వారిద్దరిని ఐసోలేషన్‌లో ఉంచారు. అమ్మమ్మ కోసం మనవడు చేసిన పనికి అధికారులు ఆశ్చర్యపోయారు. వార్నీ పిడుగా ఎంత అమ్మమ్మ అంటే ఇష్టమైతే మాత్రం ఇంత సాహసమా? అంటూ ఆ బుడతడ్ని మొచ్చుకున్నారు. 14 రోజుల క్వారంటైన్ పూర్తికాగానే రోమియో తన అమ్మమ్మను కలుసుకోనున్నాడు.

తమ ప్రయాణం గురించి తండ్రీకొడుకులు తమ ఈ సుదీర్ఘ ప్రయాణం గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘చాలా క్లిష్టమైన ప్రయాణం చేశాం. మార్గ మధ్యలో మేము ఎన్నో సమస్యలను..సవాళ్లను ఎదుర్కున్నాం. కొన్నిసార్లు భయానకమైన ప్రాంతాల్లో నిద్రపోవాల్సి వచ్చింది. మొత్తం 2,800 కిలోమీటర్లు నడిచి లండన్‌కు చేరాం. నా కొడుకు వాడి అమ్మమ్మను ప్రేమతో హగ్ చేసుకోవాలనే కోరికను తీర్చడానికి తాను కూడా వాడితో కలిసి ప్రయాణం చేశానని రోమియో తండ్రి తెలిపారు.

<script async src=”https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js”></script>
<ins class=”adsbygoogle”
style=”display:block; text-align:center;”
data-ad-layout=”in-article”
data-ad-format=”fluid”
data-ad-client=”ca-pub-6458743873099203″
data-ad-slot=”1057226020″></ins>
<script>
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>

నాకొడుకుతో ఇంత బాగా సమయం గడపటానికి వాడి ఆలోచనలతో పాటు వాడికి సంబంధించిన ఎన్నో విషయాలను నేను ఇంటిలో ఉండి తెలుసుకోలేని విషయాలు తెలుసుకున్నాననీ..వాడితో కలిసి అంత దూరం ప్రయాణం చేయటం చాలా చాలా సంతోషంగా అనిపించిందని..నా కొడుకుతో గడిపిన ప్రతీ క్షణం నాకు చాలా అపురూపంగా అనిపించిందనీ..ఇది నా జీవితాంతం గుర్తు పెట్టుకునే ప్రయాణమని తెలిపారు.

తన ప్రయాణం గురించి రోమియో మాట్లాడుతూ..మా అమ్మమ్మను చూసి సంవత్సరం దాటింది.ఇప్పుడు నేను స్కూల్ కు కూడా వెళ్లటంలేదు. దీంతో మా అమ్మమ్మతో నేను గడిపిన రోజులు నాకు పదే పదే గుర్తుకొచ్చాయి.

<script async src=”https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js”></script>
<ins class=”adsbygoogle”
style=”display:block; text-align:center;”
data-ad-layout=”in-article”
data-ad-format=”fluid”
data-ad-client=”ca-pub-6458743873099203″
data-ad-slot=”1057226020″></ins>
<script>
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>

అవెంతో ఆనందాన్నిస్తాయి. ఈ లాక్ డౌన్ లో నాకు మా అమ్మమ్మ మరింతగా గుర్తుకొచ్చేది.ఎందుకంటే ఆమె ఒంటరిగా ఉంది. ఆమెను హత్తుకోవాలని ఎంతో ఆరాటపడ్డాను..అమ్మమ్మ కోసం ఇంత దూరం నడిచి వచ్చాం.

ప్రయాణంలో ఎన్నో కష్టాలు పడ్డాం..కందిరీగల గూడు కింద నిద్రపోయినప్పుడు నన్నూ..మా నాన్నను అవి కుట్టాయి. వీధికుక్కల బారిన పడ్డాము. నడిచీ నడిచీ మా కాళ్లు రక్తాలు కారాయి. అయినా నాకు అది చాలా సంతోషంగా అనిపించింది. అమ్మమ్మను హత్తుకుంటే ఆ బాధలన్నీ మాయమవుతాయి.

<script async src=”https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js”></script>
<ins class=”adsbygoogle”
style=”display:block; text-align:center;”
data-ad-layout=”in-article”
data-ad-format=”fluid”
data-ad-client=”ca-pub-6458743873099203″
data-ad-slot=”1057226020″></ins>
<script>
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>దారిలో ఓగాడిదను మచ్చిక చేసుకున్నాం..దానితో కలిసి కొంత దూరం ప్రయాణించాం..ఇంకా ఎన్నో రకాల పక్షుల్ని చూశాం ఇవన్నీ మా అమ్మమ్మ వల్లేనని తెగ ఆనందంపడిపోతు చెప్పాడు రోమియా. దారిలో మా అమ్మ గురించి నాన్న నేను చాలా మాట్లాడుకున్నాం..మన ప్రయాణంలో ఎదురైన ఇబ్బందుల గురించి అమ్మకు చెప్పొద్దు..తెలిస్తే బాధపడుతుందని ఒకరికొరకు ఒట్టు వేసుకున్నామని నవ్వుతూ చెప్పాడు చిన్నారి రోమియో.

ఐసోలేషన్ పూర్తి చేసుకుని తన అమ్మమ్మను ఎప్పుడు కలుస్తానా అని నా మనస్సు పరితపిస్తోంది. అమ్మమ్మకు మరింత దగ్గరగా వచ్చాక ఇంకా ఆతృత పెరిగింది ఎప్పుడు చూస్తానని అని అన్నాడు. ఈ నడక ద్వారా రోమియో ఫండ్ రైజ్ ద్వారా రూ.11.4 లక్షలు సంపాదించాడు. ఆ మొత్తాన్ని శరణార్థుల పిల్లల చదువుల కోసం దానం చేస్తానని చెప్పాడు రోమియో కాక్స్ తెలిపాడు.