J&J Vaccine Single Shot : ఈయూ నుంచి ఇండియాకు 100 మిలియన్ల డోసుల జే&జే వ్యాక్సిన్?

ప్రముఖ వ్యాక్సిన్ తయారీ సంస్థ జాన్సన్ & జాన్సన్ కొవిడ్-19 వ్యాక్సిన్ సింగిల్-షాట్‌ను యూరోపియన్ యూనియన్ (EU) నుంచి సుమారు 100 మిలియన్ మోతాదులను సేకరించనున్నట్టు తెలుస్తోంది. టీకా సేకరణ కోసం AHPI ఎన్జీఓ ద్వారా నిర్వహించనున్నారు.

J&J Vaccine Single Shot : ఈయూ నుంచి ఇండియాకు 100 మిలియన్ల డోసుల జే&జే వ్యాక్సిన్?

100 Million Doses Of J&j Vaccine Likely To Be Procured From Eu To India

J&J vaccine Single Shot : ప్రముఖ వ్యాక్సిన్ తయారీ సంస్థ జాన్సన్ & జాన్సన్ కొవిడ్-19 వ్యాక్సిన్ సింగిల్-షాట్‌ను యూరోపియన్ యూనియన్ (EU) నుంచి సుమారు 100 మిలియన్ మోతాదులను సేకరించనున్నట్టు తెలుస్తోంది. టీకా సేకరణ కోసం హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ అసోసియేషన్ (AHPI) ఎన్జీఓ ద్వారా నిర్వహించనున్నారు. ఈయూలో J&J వ్యాక్సిన్ కేటాయింపును అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇవ్వనున్నారు.

అందులోభాగంగానే భారత్‌కు 100 మిలియన్ మోతాదులను అందించనున్నట్టు ఎన్జీఓ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతోందని, అతి త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ రానుందని చెప్పారు. AHPI కూడా నేరుగా వ్యాక్సిన్ సంస్థను సంప్రదించినట్టు తెలిపారు. జాన్సన్ & జాన్సన్ వ్యాక్సిన్ సింగిల్-డోస్ వ్యాక్సిన్ అనే విషయం తెలిసిందే. భారతీయ మార్కెట్లో ఇతర వ్యాక్సిన్లకు రెండు మోతాదులు తప్పనిసరి.. అందులోనూ ఖర్చుతో కూడుకున్నది కూడా.

అదే జే&జే సింగిల్ డోసు వ్యాక్సిన్ కావడంతో గ్రామీణ ప్రజలకు ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. భారత్‌లో ప్రస్తుతం ఆక్స్‌ఫర్డ్-అస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను స్థానికంగా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ బ్రాండ్ పేరుతో ఉత్పత్తి చేస్తుంది. భారత్ బయోటెక్ నుంచి కోవాక్సిన్ కూడా ఒకటి.. దేశంలో అత్యవసర వినియోగం కోసం రష్యాకు చెందిన స్పుత్నిక్ వి కూడా ఆమోదం పొందింది.

ఈ వ్యాక్సిన్‌ మోతాదుకు రూ. 450 నుంచి 550 వరకు ఖర్చవుతుందని భావిస్తున్నారు. ఈయూ ద్వారా సేకరించినట్లయితే.. 750 ఆస్పత్రుల డేటాలో 6 మిలియన్ల మోతాదుల అవసరం ఉండొచ్చు అంటున్నారు. భారతదేశంలో వ్యాక్సిన్‌కు ట్రయల్స్ అవసరం ఉండకపోవచ్చని డాక్టర్ గయానీ అభిప్రాయపడ్డారు.