న్యూయార్క్‌లో ఎమర్జెన్సీ.. అమెరికాలో 19మందికి కరోనా

న్యూయార్క్‌లో ఎమర్జెన్సీ.. అమెరికాలో 19మందికి కరోనా

వాషింగ్టన్‌ను వణికిస్తోంది కరోనా. మరో ఇద్దరు కరోనా బారిన పడటంతో 19కేసులు నమోదయ్యాయి. దీంతో క్రూయిజ్ షిప్‌తో పాటు కలిపి న్యూయార్క్ కేసులు 89కి చేరాయి. అమెరికాలోని సగం రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. గతేడాది చైనాలో మొదలైన కరోనాను COVID-19గా పేరు మార్చారు. 

వైరస్ వ్యాప్తి కాకుండా ఉండేందుకు అమెరికా గవర్నమెంట్.. కాన్ఫిరెన్స్‌లు, కమిటీ సమావేశాలను, యూనివర్సిటీ క్లాసులను రద్దు చేసింది. ఇంటి నుంచే క్లాసులను ఆన్‌లైన్లో బోధించడం మొదలుపెట్టింది. గత నెలలో జరిగిన వార్షిక సమావేశంలో ఒక హై ప్రొఫైల్ వ్యక్తికి కరోనా కన్ఫామ్ అయినట్లు తెలిసింది. అదృష్టవశాత్తు ఆ వ్యక్తి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్‌ను నేరుగా కలవలేదని అమెరికన్ కన్జర్వేటివ్ యూనియన్ ప్రకటించింది. 

వాషింగ్టన్‌లో నమోదైన రెండు కరోనా మృతులతో యూఎస్‌లో వ్యాప్తిని అడ్డుకోవాలని ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. తొలి సారిగా ఫ్లోరిడాలో కరోనా నమోదై ఇద్దరు మృతి చెందారు. న్యూయార్క్‌లో 13కు పెరగడంతో అమెరికా వ్యాప్తంగా 89కి చేరింది మృతుల సంఖ్య. ఎమర్జెన్సీ ప్రకటించడంతో కొత్త కేసులు నమోదయ్యే అవకాశాలు తగ్గుతాయని భావిస్తున్నట్లు గవర్నర్ ఆండ్రూ కువోమో తెలిపారు.  

చైనాలో డిసెంబరులో మొదలైన ఈ వైరస్ ప్రపంచంలోని పలు దేశాలకు పాకింది. లక్ష మందికి పైగా సోకిన కరనా.. 3వేల 500మంది ప్రాణాలు తీసింది.