Hindu Homes : ఆగని హింస.. హిందువుల ఇళ్లకు నిప్పు, 66 ఇళ్లు ధ్వంసం

దుర్గా మాత పూజ సందర్భంగా ప్రారంభమైన అల్లర్లు మరింత హింసాత్మకంగా మారాయి. ఈ మతపరమైన హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు ఆరుగురు మరణించారు. తాజాగా, 20 హిందువుల నివాసాలకు అల్లరి

Hindu Homes : ఆగని హింస.. హిందువుల ఇళ్లకు నిప్పు, 66 ఇళ్లు ధ్వంసం

Bangladesh Hindu Homes

Hindu Homes : బంగ్లాదేశ్ లో దుర్గా మాత పూజ సందర్భంగా ప్రారంభమైన అల్లర్లు మరింత హింసాత్మకంగా మారాయి. ఈ మతపరమైన హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు ఆరుగురు మరణించారు. తాజాగా, 20 హిందువుల నివాసాలకు అల్లరిమూకలు నిప్పంటించాయి. 66 ఇళ్లను ధ్వంసం చేశారని అధికార వర్గాలు వెల్లడించాయి.

ఓ సోషల్ మీడియా పోస్టులో దుర్గామాత కాళ్ల దగ్గర ఖురాన్ ఉండడం ఈ అల్లర్లకు కారణమని ప్రచారం జరుగుతోంది. రంగ్ పూర్ జిల్లాకు చెందిన ఓ యువకుడు ఈ పోస్టును ఫేస్ బుక్ లో పెట్టినట్టు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ యువకుడు ఉంటున్న గ్రామంపై(మాజిపురా) 100 మంది అరాచకవాదులు దండెత్తి, ఇళ్లను ధ్వంసం చేసినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. ఆ యువకుడికి రక్షణగా పోలీసులు అతడి ఇంటి దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో అల్లరిమూకలు రెచ్చిపోయాయి. ఇళ్లకు నిప్పు పెట్టారు.

Heart Attack : షుగర్ వ్యాధి మందులతో గుండెపోటు ముప్పు పొంచివుందా?..

ఆదివారం అర్థరాత్రి తర్వాత గ్రామంలో అలజడి మొదలైంది. ఆ గ్రామం బంగ్లా రాజధాని డాకాకు 255 కిలోమీటర్లు దూరంలో ఉంది. అగ్నిప్రమాదం గురించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగింది. కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేయగలిగారు.

మతపరమైన ఘర్షణలకు సంబంధించి పోలీసులు ఆదివారం 4 వేల మందికి పైగా ఆందోళనకారులపై కేసులు నమోదు చేయడంతో పాటు 20 మందిని అరెస్టు చేశారు. చిట్టగాంగ్‌ డివిజన్‌ కుమిల్లా పట్టణంలో దసరా ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన దుర్గా పూజ సందర్భంగా ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్‌ను అపవిత్రం చేశారనే ఆరోపణలతో శుక్రవారం ఆందోళనల సందర్భంగా పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

Pills : గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా?..దుష్పప్రభావాలు ఇవే..

విధ్వంసం, భద్రతా సిబ్బందిపై దాడి, ప్రభుత్వ విధులకు అటంకం కలిగించడం వంటి అభియోగాలతో ఢాకాలోని పల్తాన్‌, రమ్నా, చౌక్‌బజార్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో నాలుగు వేల మందికి పైగా ఆందోళనకారులపై కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. కుమిల్లా, చాంద్ పూర్, చత్తోగ్రామ్, కాక్స్ బజార్, బందర్ బాన్, మౌల్విబజార్, గాజీపూర్, ఫెని ఇతర జిల్లాలకు అల్లర్లు పాకాయి. చాంద్ పూర్, నోక్ హాలిలో జరిగిన అల్లర్లలో నలుగురు హిందువులు చనిపోయారని బంగ్లా హిందూ బుద్దిస్ట్ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ తెలిపింది.

మతపరమైన హింసను ఆ దేశ ప్రధాని షేక్‌ హసీనా ఖండించారు. దాడులు చేసిన వారిని మతాలకతీతంగా పట్టుకొని కఠినంగా శిక్షిస్తామన్నారు.