South Africa: అనుమానాస్పద స్థితిలో 20మంది మృతి.. వారి శరీరాలపై మాత్రం..

దక్షిణాఫ్రికాలోని ఈస్ట్ లండన్‌లోని ఓ టౌన్‌షిప్‌ నైట్‌క్లబ్‌లో 20మంది యువకులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆదివారం తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మరణాలకు కారణమేమిటనే దానిపై దర్యాప్తు ప్రారంభించినట్లు ప్రావిన్షియల్ పోలీసు ప్రతినిధి బ్రిగేడియర్ థెంబింకోసి కినానా తెలిపారు.

South Africa: అనుమానాస్పద స్థితిలో 20మంది మృతి.. వారి శరీరాలపై మాత్రం..

20 People Killd

South Africa: దక్షిణాఫ్రికాలోని ఈస్ట్ లండన్‌లోని ఓ టౌన్‌షిప్‌ నైట్‌క్లబ్‌లో 20మంది యువకులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆదివారం తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ క్లబ్ లోని పలు ప్రదేశాల్లో మృతదేహాలు పడిఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే 17మంది మృతిచెందగా.. మరికొందరు అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గుర్తించారు. వారినిచికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మరో ముగ్గురు మరణించడంతో మృతుల సంఖ్య 20కి చేరింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ప్రాంతీయ ప్రభుత్వ భద్రతదా విభాగం అధిపతి వెజివే టికానా-గ్క్సోథివే తెలిపారు.

medical students: ఢిల్లీలో ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన విద్యార్థుల ఆందోళన

తూర్పులండన్ నగరంలోని సీనరీ పార్క్‌లో నైట్‌క్లబ్‌లో చోటు చేసుకున్న ఈ మరణాలకు కారణమేమిటనే దానిపై దర్యాప్తు ప్రారంభించినట్లు ప్రావిన్షియల్ పోలీసు ప్రతినిధి బ్రిగేడియర్ థెంబింకోసి కినానా తెలిపారు. అయితే మృతులంతా 18 నుంచి 20 ఏళ్ల వయస్సువారే. ఈస్టర్న్ కేప్ ప్రావిన్షియల్ కమ్యూనిటీ, సేఫ్టీ డిపార్ట్‌మెంట్ అధికారి ఉనతి బింకోస్ సంఘటన స్థలం నుండి మాట్లాడుతూ.. తొక్కిసలాట మరణానికి కారణం కాదని తెలిపాడు. మృతుల శరీరాలపై ఎలాంటి గాయాలు లేవని మేము గుర్తించామని, ఈ కారణంగా మరణాలకు తొక్కిసలాట కారణం అవుతుందని తాము భావించడం లేదని తెలిపారు. మృతదేహాలు టేబుల్‌లు, కుర్చీలు, నేలపై పడి ఉన్నాయి. గాయం అయిన ఆనవాళ్లు లేవని ఆయన తెలిపారు.

Shocking Video : విడాకులు తీసుకున్న భార్యను తాళ్లతో కట్టేసి..నాలుగో అంతస్తు నుంచి తోసేసి…….

జోహన్నెస్‌బర్గ్‌కు దక్షిణాన దాదాపు 1,000 కిలోమీటర్ల దూరంలో హిందూ మహాసముద్ర తీరంలో ఉన్న నగరంలోని క్లబ్ వద్దకు మృతుల కుటుంబ సభ్యులు చేరుకొని తమ బిడ్డల మృతదేహాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే దర్యాప్తు చేస్తున్నామని ఇప్పుడు మీకు మృతదేహాలు అప్పగించడం జరగదని పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే హైస్కూల్ పరీక్షలు రాసిన తర్వాత జరిగిన ఒక పార్టీ అని, అయితే 20 మంది ఎలా మృతిచెందారో తెలియాలంటే దర్యాప్తు పూర్తికావాలని అక్కడి పోలీసులు తెలిపారు.