Crazy Woman :ఆహారం, కూరగాయలంటే ఆమెకు భయం..చూస్తే చాలు వణికిపోతుంది..ఏం తిని బతుకుతోందంటే..

ఆమెకు ఆహారం చూస్తే భయపడిపోతుంది. కూరగాయలు చూస్తే వణికిపోతుంది. ఇంత భయం ఉన్న ఆమె చిన్నప్పటినుంచి ఏం తిని జీవిస్తుందంటే..

Crazy Woman :ఆహారం, కూరగాయలంటే ఆమెకు భయం..చూస్తే చాలు వణికిపోతుంది..ఏం తిని బతుకుతోందంటే..

England Women Charlotte Whittle Vegetable Phobia

Charlotte Whittle vegetable phobia : మనం ఎంత కష్టపడి సంపాదించినా జానెడు కడుపు నింపుకోవాల్సిందే. ఈ పొట్టను నింపుకోవటానికి రకరకాల రుచుల్ని ఆస్వాదిస్తాం.బిర్యానీ,చికెన్, మటన్,ఫిష్, ఎగ్స్, ఆకుకూరలు,కాయగూరలు ఇలా ఎన్నో తింటాం.కానీ ఘమఘుమలాడే ఆహారాన్ని చూస్తే లొట్టలేసుకుంటు తినేస్తాం. తాజాగా ఉండే కూరగాయల్ని చూస్తే కొరుక్కుని తినేయాలనిపిస్తుంది. కానీ ఓ మహిళా మాత్రం వెరీ వెరీ డిఫరెంట్. కూరగాయల్ని చూస్తే చాలు భయపడిపోతుంది.తినే ఆహారాన్ని చూస్తే చాలు వణికిపోతుంది. వాటిని చూస్తే ఆమెకు ఒళ్లంతా చెమటలు పట్టేస్తాయి. శరీరం వణికిపోతుంది. మరి ఇవంటే ఇంత భయపడే ఈమె వీటిని ఎలా తింటుంది? అనే కదా మీ డౌటు..నిజమే ఎంత భయమైనా తినాల్సిందేకదా..కానీ వీటిని తినదు సరికదా అస్సలు వాటివైపే కన్నెత్తి చూడదు.మరి ఏం తింటుంది?ఎలా జీవిస్తుంది? అనే కదా మరో డౌటు..ఇవన్నీ తెలుసుకోవాలంటే ఆమెగురించి తెలుసుకోవాల్సిందే..

Read more : wife cockroach Phobia : బొద్దింకలంటే చచ్చేంత భయపడుతున్న భార్య..విడాకులు కావాలంటున్న భర్త

ఇంగ్లండ్‌లోని నార్త్ యార్క్‌షైర్‌కు చెందిన షార్లెట్ విటిల్ అనే 34 ఏళ్ల మహిళకు కూరగాయలు,ఆహారం అంటే విపరీతమైన భయం.ఆమెకు ఊహ తెలిసినప్పటినుంచి ఇదే పరిస్థితి. అలా ఆమె ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క కూరగాయ తిన్నదే లేదు. ఇటువంటి వింత పరిస్థితి ఆమెకు ఓ రకమైన వింత ఫోబియాతో వచ్చింది. ఆమె ఏం తిని జీవిస్తుందంటే..షార్లెట్ రైస్‌ కేక్‌, టమాట సూప్‌ తాగుతూ జీవితాన్ని నెట్టుకొస్తోంది పాపం. చిన్ననాటినుంచి అదే పరిస్థితి. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆకలిగా లేదోమో అందుకే.. తినడం లేదని అనుకునేవారు. ఆకలి కోసం కొన్ని మందులు వాడినా అదే పరిస్థితి. బలవంతంగా ఏదైనా తినిపిస్తే వామ్టింగ్ చేసేసుకునేదట.

అలా పెరిగే కొద్దీ ఆ పరిస్థితి కూడా పెరిగింది ఆమెతో పాటే.సాస్‌ వేసిన ఆహారం చూసినా.. మిల్క్‌ షేక్‌లు, వేర్వేరు ఫుడ్‌ ఐటమ్స్‌ చూసినా భయపడిపోతుంది. అవంటేనే ఒకరకమైన భయం పెరిగిపోయింది. ఇలాంటి ఆహారాన్ని తినటం మాట పక్కన పెడితే వాటిని చూస్తే చాలు ఆమె అరచేతుల్లో చెమటలు పట్టేస్తాయి. ఏళ్లు గడుస్తున్న కొద్ది షార్లెట్‌కి ఆహారం అంటే భయం పెరుగింది తప్ప ఏమాత్రం తగ్గలేదు. దాంతో షార్లెట్‌ తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యులకు చూపించారు.డాక్టర్లు షార్లెట్‌ను పరిశీలించి.. ఆమె ఒక వింత ఫుడ్‌ ఫోబియాతో బాధపడుతుందని తెలిపారు. దీనివల్ల షార్లెట్‌ స్కూల్లో ఫ్రెండ్స్‌తో కలిసి తినేది కాదు. చదువుకునే రోజుల్లో తల్లిదండ్రుల వద్దే ఉండేది కాబట్టి.. ఈ ఫోబియా వల్ల షార్లెట్‌ పెద్దగా ఇబ్బందిరాలేదు. అలాగే రోజులు నెట్టుకొచ్చింది కొన్ని రకాల సూపులు తాగుతు.

Read more : Wine car : వైన్‌తో నడిచే కారు నడుపుతున్న ప్రిన్స్ చార్లెస్..దటీజ్ రాయల్ రాజకుటుంబం రేంజ్

చదువు పూర్తయిన షార్లెట్‌కి ఉద్యోగం వచ్చింది. దాంతో ఆమె తల్లిదండ్రులను విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్లాల్సివచ్చింది. అక్కడ ఆఫీసులో ఉద్యోగులందరికి భోజనాలు. ఆఫీసులో ఓ డిపార్ట్ మెంటే ఉంది ఉద్యోగులకు వండిపెట్టటానికి. ఈక్రమంలో ఎలాగైనా అలవాటు చేసుకుందామని ఎంతగానో యత్నించింది. కానీ ఆమె వల్ల కాలేదు సరికదా..అరచేతుల్లోను ఒళ్లంతా చెమటలు పట్టేసేవి. దీంతో షార్లెట్ ఏమీ తినటంలేదేంటీ అని తోటి ఉద్యోగులు అడిగేవారు. కొన్ని రోజులు ఏవో సాకులు చెప్పి తప్పించుకుంది. కానీ తర్వాత ధైర్యం చేసి తనకు ఉన్న ఫోబియా గురించి చెప్పి.. తన ఆహారాన్ని తానే తయారు చేసుకుని తాగేది.

తన పరిస్థితి గురించి షార్లెట్‌ మాట్లాడుతూ.. ‘‘చిన్నప్పటి నుంచి కూరగాయలు చూస్తే నాకు భయం. అందరిలా ఆహారం తినాలని ఆశపడేదాన్ని..అలవాటు చేసుకోవాలని యత్నించేదాన్ని. కానీ నా వల్ల అయ్యేది కాదు. అలా నేను పెరుగుతున్న కొద్ది నాలో భయం కూడా పెరగింది. ఈక్రమంలోనే నేను ఈ పరిస్థితినుంచి తప్పించుకోవటానికి చాలారకాలుగా యత్నించారు.కానీ ప్రతీసారి అదే భయం పెరిగిందే తప్ప తగ్గలేదు.

ఇప్పుడు ఆహారాన్ని సరిగా ఉడికించపోయినా.. సరిగా వడ్డించకపోయినా నాకు కడుపులో దేవేస్తుంది. ప్రస్తుతం నేను రైస్‌ కేక్‌, టమాటా సూప్‌ మాత్రమే తీసుకుంటున్నాను. ఈ ఫోబియా నా సోషల్‌ జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. దీని వల్ల స్నేహితులతో కలిసి బయట తినడానికి వెళ్లలేకపోతున్నాను. కానీ ఈ పరిస్థితి నుంచి బయటపడాలని బలంగా కోరుకుంటున్నాను..పదే పదే యత్నిస్తున్నాను. త్వరలోనే ఈ భయాన్ని జయిస్తానని చెబుతోంది షార్లెట్.