Afghanistan : కాబూల్ ఎయిర్ పోర్ట్ పై రాకెట్ దాడులు

తాలిబన్​ ఆక్రమిత అప్ఘానిస్తాన్​లో పరిస్థితులు రోజురోజుకు మరింత ఆందోళకరంగా మారుతున్నాయి. వరుస బాంబు పేలుళ్లతో రాజధాని కాబూల్ దద్దరిల్లుతోంది.

Afghanistan : కాబూల్ ఎయిర్ పోర్ట్ పై రాకెట్ దాడులు

Kb

Afghanistan  తాలిబన్​ ఆక్రమిత అప్ఘానిస్తాన్​లో పరిస్థితులు రోజురోజుకు మరింత ఆందోళకరంగా మారుతున్నాయి. వరుస బాంబు పేలుళ్లతో రాజధాని కాబూల్ దద్దరిల్లుతోంది. ఎప్పుడు ఏ బాంబు పేలుడుకి ప్రాణాలు కోల్పోతామా అనే భయంలో బతుకువెళ్లదీస్తున్నారు కాబూల్ వాసులు. గత గురువారం కాబూల్ ఎయిర్ పోర్ట్ సమీపంలో ఐసిస్-కే ఉగ్రసంస్థ జరిపిన రెండు ఆత్మహుతి దాడుల్లో 160మందికి పైగా ప్రాణాలు కోల్పోగా..ఆదివారం(ఆగస్టు-29,2021)మరోసారి కాబూల్ ఎయిర్ పోర్ట్ సమీపంలో జరిగిన రాకెట్ దాడిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇక,ఈ రెండు పేలుడు ఘటనల్లో పదుల సంఖ్యలో ప్రజలు గాయాలపాలై హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు.

అయితే తాజాగా మరోసారి రాకెట్ దాడులు కాబూల్ లో కలకలం రేపాయి. సోమవారం ఉదయం కాబూల్ లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వైపు ఐదు రాకెట్లు ప్రయోగించబడినట్లు విమానాశ్రయంలో ఉన్న మిసైల్ ఢిఫెన్స్ వ్యవస్థ గుర్తించింది. కాబూల్ లోని కహనా ఏరియా నుంచి మొత్తం ఆరు రాకెట్లు ప్రయోగించబడగా..ఇందులో ఐదు ఎయిర్ పోర్ట్ లక్ష్యంగా ప్రయోగించబడ్డాయని..వీటిని మిసైల్ ఢిఫెన్స్ సిస్టమ్ గుర్తించి పేల్చేసినట్లు సమాచారం. మరో రాకెట్ ని ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్ లక్ష్యంగా వదిలినట్లు సమాచారం. అయితే.. ఈ క్షిపణులను ఎవరు ప్రయోగించరాన్నది ఇంకా తెలియరాలేదు. ఇక,ఈ దాడుల్లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు,గాయపడ్డారు అన్న పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ రాకెట్​ దాడుల కారణంగా అమెరికా తరలింపు ప్రక్రియకు కాసేపు ఆటంకం ఎదురైంది. దీనిపై ఆ దేశం వెంటనే స్పందించలేదు. ఈ రాకెట్ దాడుల గురించి, అధ్యక్షుడు జో బైడెన్​కు అధికారులు తెలియజేశారని శ్వేతసౌధం ఓ ప్రకటన విడుదల చేసింది. బలగాల తరలింపు కోసం మోహరింపును పెంచాలని బైడెన్ సూచించారని చెప్పింది. రాకెట్​ దాడుల తర్వాత తిరిగి యథావిధిగా తరలింపు ప్రక్రియను అమెరికా కొనసాగించినట్లు పేర్కొంది.

అమెరికా డ్రోన్ దాడిలో 10 మంది అప్ఘాన్ లు మృతి

మరోవైపు, కాబుల్​ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఐసిస్​-కె పన్నిన కుట్రను అమెరికా ఆదివారం భగ్నం చేసింది. ముష్కరుల వాహనంపై అమెరికా జరిపిన డ్రోన్​ దాడి.. కొంతమంది అఫ్గాన్​ పౌరులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. అమెరికా జరిపిన దాడుల కారణంగా పది మంది మరణించారని సమాచారం. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఉగ్రకుట్రను భగ్నం చేసేందుకు అమెరికా జరిపిన దాడి(US Drone Attack) కొంతమంది అఫ్గాన్​ పౌరులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. అమెరికా జరిపిన దాడుల కారణంగా పది మంది మరణించారని టోలో న్యూస్​ తెలిపింది. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు చెప్పింది.

కాబుల్‌ విమానాశ్రయం వద్ద గత గురువారం నరమేధానికి పాల్పడ్డ ఐఎస్‌ఐఎస్‌-కె ఉగ్ర సంస్థ ఆదివారం మరోసారి అలాంటి దాడికి వ్యూహరచన చేసిందని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ అధికార ప్రతినిధి కెప్టెన్‌ బిల్‌ అర్బన్‌ ఆదివారం తెలిపారు. ఆత్మాహుతి పేలుళ్లకు పాల్పడేందుకు ఓ వాహనంలో ముష్కరులు దూసుకురావడాన్ని తాము గుర్తించామన్నారు. డ్రోన్‌ దాడి ద్వారా వారిని హతమార్చామని చెప్పారు. డ్రోన్‌ దాడి అనంతరం భారీ పేలుళ్లు చోటుచేసుకున్నాయని.. వాహనం నిండా పేలుడు పదార్థాలు ఉన్నట్లు దీని ద్వారా అర్థమవుతోందని చెప్పారు.

READAfghanistan : కాబూల్ రాకెట్ దాడిలో ఆరుగురు మృతి..అమెరికా వైమానిక దాడి!