Earthquake: తజికిస్తాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదు

ఉదయం ఐదున్నర గంటల సమయంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైనట్లు అమెరికాకు చెందిన భూగర్భ శాస్త్ర నిపుణులు తెలిపారు. చైనాలోని జింజియాంగ్ ప్రావిన్స్ సమీపంలోని, పశ్చిమ ముఘ్రాబ్ ప్రాంతానికి 67 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది.

Earthquake: తజికిస్తాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదు

Earthquake: తజికిస్తాన్‌లో గురువారం వేకువఝామున భూకంపం సంభవించింది. ఉదయం ఐదున్నర గంటల సమయంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైనట్లు అమెరికాకు చెందిన భూగర్భ శాస్త్ర నిపుణులు తెలిపారు. చైనాలోని జింజియాంగ్ ప్రావిన్స్ సమీపంలోని, పశ్చిమ ముఘ్రాబ్ ప్రాంతానికి 67 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది.

Gurugram: కోవిడ్ భయంతో మూడేళ్లుగా ఇంటి నుంచి బయటకు రాని తల్లీకొడుకు.. మూడేళ్లుగా ఎలా ఉన్నారంటే

ఈ భూకంపం కస్ఘర్, కిజిల్సు కిర్గిజ్ ప్రాంత సరిహద్దుల్లో ఎక్కువగా నమోదైంది. భూమికి 20 కిలోమీటర్ల లోతున ఈ భూకంపాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఘ్రాబ్ జిల్లాలో అనేక పామిర్ పర్వతాలు ఉంటాయి. ఇక్కడ వేలాది మంది నివసిస్తుంటారు. భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. మరోవైపు చైనా కూడా ఈ భూకంపంపై స్పందించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతున, 7.2 తీవ్రతతలో భూకంపం నమోదైనట్లు చైనా శాస్త్రవేత్తలు వెల్లడించారు.

తజికిస్తాన్‌లో భూకంపం సంభవించిన ప్రాంతంలో సరేజ్ అనే నది ఉంది. భూకంపం వల్ల నదిపై ఉన్న బ్రిడ్జి కూలితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని అక్కడి నిపుణులు హెచ్చరిస్తున్నారు. తజికిస్తాన్‌లో తరచూ ప్రకృతి విపత్తులు నమోదవుతుంటాయి. భూకంపాలు, వరదలు, కొండ చరియలు విరిగిపడటం, హిమపాతం వంటివి తరచూ సంభవిస్తాయి.