Russian Bomb Hits School : యుక్రెయిన్‌లో స్కూల్‌పై రష్యా బాంబు దాడి… 60మంది మృతి

రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. రష్యా బలగాలు బాంబులు, క్షిపణుల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా యుక్రెయిన్ తూర్పు భాగంలోని లుహాన్స్క్ ప్రాంతంలో భీకర దాడులు చేపట్టాయి.(Russian Bomb Hits School)

Russian Bomb Hits School : యుక్రెయిన్‌లో స్కూల్‌పై రష్యా బాంబు దాడి… 60మంది మృతి

Russian Bomb Hits School

Russian Bomb Hits School : రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. రష్యా బలగాలు బాంబులు, క్షిపణుల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా యుక్రెయిన్ తూర్పు భాగంలోని లుహాన్స్క్ ప్రాంతంలో రష్యా సేనలు భీకర దాడులు చేపట్టాయి. లుహాన్స్క్ ప్రాంతంలోని బైలోహారివ్కా గ్రామంలోని స్కూల్ పై రష్యా బలగాలు బాంబు దాడి జరిపాయి. ఈ ఘటనలో 60 మంది మరణించారు. దీనిపై లుహాన్స్క్ గవర్నర్ సెర్హీ గైడాయ్ స్పందించారు.

రష్యన్ సేనలు శనివారం మధ్యాహ్నం పాఠశాలపై ఓ బాంబును జారవిడిచాయని గవర్నర్ వెల్లడించారు. ఆ సమయంలో స్కూల్ లో 90 మంది వరకు ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు. బాంబు దాడితో స్కూల్ పూర్తిగా నేలమట్టమైందన్నారు. దాదాపు 4 గంటలు శ్రమిస్తేనే కానీ అగ్నికీలలు అదుపులోకి రాలేదన్నారు. 30 మందిని శిథిలాల నుంచి బయటకు తీసుకొచ్చామని తెలిపారు.(Russian Bomb Hits School)

Britain aid to Ukraine: యుక్రెయిన్ కు రూ.12 వేల కోట్లు ఆర్ధిక సహాయం ప్రకటించిన బ్రిటన్

”రష్యాకు చెందిన విమానం ఈ భవనంపై బాంబు జార విడిచింది. దాడికి గురైన పాఠశాల సరిహద్దులకు కేవలం ఏడు మైళ్ల దూరంలో ఉంది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. అనంతరం దాదాపు నాలుగు గంటలపాటు అగ్నికీలలు ఎగసిపడ్డాయి” అని స్థానిక అధికారులు తెలిపారు.

60 Feared Dead After Russian Bomb Hits School In Ukraine's Luhansk

60 Feared Dead After Russian Bomb Hits School In Ukraine’s Luhansk

కాగా, యుక్రెయిన్ లోని ఇతర ప్రాంతాల్లోనూ రష్యా సేనలు దాడులు ముమ్మరం చేశాయి. రష్యా సైన్యం యుక్రెయిన్ లోని సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుంటోందని యుక్రెయిన్ ప్రభుత్వంతో పాటు, పాశ్చాత్య దేశాలు కూడా ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను రష్యా కొట్టిపారేస్తోంది.(Russian Bomb Hits School)

ఇది ఇలా ఉంటే.. రష్యా దురాక్రమణను వ్యతిరేకిస్తున్న పలు దేశాలు యుక్రెయిన్ కు అండగా నిలుస్తున్నాయి. యుక్రెయిన్ పెద్ద మొత్తం ఆర్థిక, ఆయుధ సామాగ్రి సాయం చేస్తున్నాయి. తాజాగా బ్రిటన్‌ నుంచి యుక్రెయిన్‌కు మరో 1.3 బిలియన్‌ డాలర్ల(రూ.12వేల 344 కోట్లు) సైనిక సాయం అందనుంది. ఈ విషయాన్ని బ్రిటన్‌ ట్రెజరీ విభాగం ఆదివారం వెల్లడించింది. వర్చువల్‌ జీ-7 సదస్సుకు ముందు ఈ సాయం ప్రకటించారు. అఫ్ఘానిస్తాన్‌, ఇరాక్‌ యుద్ధం తర్వాత బ్రిటన్‌ ఈ స్థాయిలో కేటాయింపులు చేయడం ఇదే తొలిసారి. గత వారం ఉక్రెయిన్‌కు 300 మిలియన్‌ డాలర్ల సైనిక సాయం చేస్తామని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Ukraine – Russia: యుక్రెయిన్ లో అణ్వాయుధాలను మోహరించే ఉద్దేశం లేదు: రష్యా

మరోవైపు రష్యా యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో నానాటికీ దిగజారుతున్న పరిస్థితులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ యుద్ధానికి ముగింపు పలికేందుకు ఉన్న ఏకైక పరిష్కారం చర్చలు, దౌత్య మార్గమేనని అభిప్రాయపడింది. రక్తపాతం వల్ల ఎలాంటి పరిష్కారం లభించదని మరోసారి నొక్కి చెప్పింది.