జింక కడుపులో 7 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు

  • Published By: veegamteam ,Published On : November 26, 2019 / 02:19 PM IST
జింక కడుపులో 7 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు

బ్యాంకాక్‌లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఓ మూగ జీవిని బలితీసుకున్నాయి. థాయ్‌లాండ్‌లో జింక శరీరంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు చేరుకోవడంతో మృతి చెందింది. ఉత్తర నాన్‌ ప్రావిన్స్‌లోని ఖున్‌ సతాన్‌ నేషనల్‌ పార్కులో జింక మృతదేహంలో 7 కిలోల ప్లాస్టిక్‌ వ్యర్థాలను వెలికితీశారు. జింక పొట్టలో నుంచి బయటకు తీసిన ప్లాస్టిక్‌ వ్యర్థాల్లో డ్రాయర్‌ కూడా ఉండటం గమనార్హం.

135 సెంటీమీటర్ల ఎత్తు, 230 సెంటీమీటర్ల పొడవున్న మగజింక పదేళ్ల వయస్సున్నట్లు గుర్తించారు. కాఫీ, నూడుల్‌ ప్యాక్‌లు, ప్లాస్టిక్‌ బ్యాగులు, రబ్బర్‌ గ్లౌవ్స్‌, హ్యాండ్‌కర్చీఫ్‌, ప్లాస్టిక్‌ రోప్‌తోపాటు ఇతర ప్లాస్టిక్‌ వ్యర్థాలు బయటపడ్డాయి. ప్లాస్టిక్‌ వ్యర్థాలు పర్యావరణానికి ఎంత హాని కలిగిస్తాయనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.