Ukraine Soldiers: రష్యా భీకర దాడులు.. 70మంది యుక్రెయిన్ సైనికులు మృతి

ఒకిట్రికా నగరం దగ్గర రష్యా బలగాలు జరిపిన ఓ రాకెట్ దాడిలో యుక్రెయిన్ కు చెందిన 70 మంది సైనికులు(Ukraine Soldiers) మృతి చెందారు. అంతేకాదు పదుల సంఖ్యలో సాధారణ పౌరులూ

Ukraine Soldiers: రష్యా భీకర దాడులు.. 70మంది యుక్రెయిన్ సైనికులు మృతి

Ukraine Soldiers

Ukraine Soldiers: రష్యా చెలరేగిపోతోంది. మరింత దూకుడు పెంచింది. యుక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తోంది. యుక్రెయిన్ సైనిక శక్తిని నిర్వీర్యం చేయడమే లక్ష్యమని చెబుతున్న రష్యా… ఆ దిశగా దాడులు ముమ్మరం చేసింది. గత కొన్నిరోజులతో పోల్చితే ఇవాళ భారీ ఎత్తున బలగాలను రంగంలోకి దించింది. రష్యా తన సైన్యంలో సగం బలగాలను యుక్రెయిన్ రాజధాని కీవ్ దిశగా తరలిస్తున్నట్టు సమాచారం. అదే సమయంలో యుక్రెయిన్ లోని ఇతర నగరాలనూ చేజిక్కించుకునేందుకు భీకర దాడులు చేస్తోంది.

ఒకిట్రికా నగరం దగ్గర రష్యా బలగాలు జరిపిన ఓ రాకెట్ దాడిలో యుక్రెయిన్ కు చెందిన 70 మంది సైనికులు(Ukraine Soldiers Killed) మృతి చెందారు. అంతేకాదు పదుల సంఖ్యలో సాధారణ పౌరులు కూడా మరణించారని యుక్రెయిన్ వర్గాలు తెలిపాయి. కాగా, రష్యా దాడులు ప్రారంభించాక యుక్రెయిన్ లో ఇప్పటివరకు 102 మంది సాధారణ పౌరులు బలైనట్టు ఐక్యరాజ్యసమితి తెలిపింది. చనిపోయిన వారిలో ఏడుగురు చిన్నారులు ఉన్నారంది.

Ukraine Russia War : యుక్రెయిన్‌పై వెనక్కి తగ్గని పుతిన్.. ఆ ధైర్యం ఇచ్చింది ఇతడేనట..!

వరుసగా 6వ రోజు(మార్చి 1) కూడా రష్యా, యుక్రెయిన్ మధ్య భీకర పోరు నడుస్తోంది. రష్యా సేనలు దాడులను ఉధృతం చేయడంతో యుక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అయితే, యుక్రెయిన్ సేనలు వెనక్కి తగ్గేదేలే అంటున్నాయి. రష్యా బలగాలను ధీటుగానే ఎదుర్కొంటున్నారు. రష్యా సైన్యానికి యుక్రెయిన్‌ బలగాల(Ukraine Soldiers) నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. తమకు ఆయుధాలు ఉంటే చాలని, రష్యాపై పోరాటం ఆపబోమని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ మరోసారి స్పష్టం చేశారు.

Indian Student: రష్యా బాంబు దాడిలో భారత విద్యార్థి మృతి

యుక్రెయిన్‌పై యుద్ధం గురించి తాజాగా రష్యా సంచ‌ల‌న ప్ర‌కట‌న చేసింది. నిర్దేశించుకున్న‌ల‌క్ష్యం నెర‌వేరే దాకా యుక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపేదే లేద‌ంది. ఈ మేరకు ఆ దేశ ర‌క్ష‌ణ మంత్రి సెర్గీ షోయిగువే కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తాము నిర్దేశించుకున్న ల‌క్ష్యాల‌ను సాధించేవరకు ర‌ష్యా సాయుధ ద‌ళాలు ప్ర‌త్యేక సైనిక చ‌ర్య‌ను కొన‌సాగిస్తాయ‌ని ఆయ‌న వెల్లడించారు.

యుక్రెయిన్‌ను నిస్సైనీక‌ర‌ణ చేయ‌డంతో పాటుగా యుక్రెయిన్ నుంచి నాజీ త‌త్వాన్ని పార‌దోల‌డ‌మే ర‌ష్యా ల‌క్ష్యాల‌ని సెర్గీ తెలిపారు. యుక్రెయిన్‌ను నిస్సైనీక‌ర‌ణ చేసేందుకు తాము సైనిక చ‌ర్య‌కు పాల్ప‌డితే.. అందుకు ప్ర‌తిగా పాశ్చాత్య దేశాలు త‌మ‌పై ఆంక్ష‌లు విధిస్తున్నాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సెర్గీ.. పాశ్చాత్య దేశాల సైనిక ముప్పు నుంచి ర‌ష్యాను కాపాడుకోవ‌డం కూడా త‌మ ప్ర‌థ‌మ ప్రాధాన్య‌మ‌ని తెలిపారు.

యుక్రెయిన్ లో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. యుక్రెయిన్ పౌరులను సైతం రష్యా దళాలు లక్ష్యంగా చేసుకోవడంతో ఏ క్షణంలో ఏం జరుగుతోందనన్న భయానక వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. యుక్రెయిన్ రాజధాని కీవ్ లో ఉంటున్న భారతీయులకు కీలక ఆదేశాలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ”ఇన్ని రోజులూ ఒక లెక్క.. ఇప్పుడొక లెక్క” అర్ధరాత్రి లోగా కీవ్ ను వదిలేసి వచ్చేయాల్సిందేనంటూ భారత రాయబార కార్యాలయం తెగేసి చెప్పింది. రైళ్లు లేదా ఇతర మార్గాల్లో ఈ రోజే కీవ్ ను వీడాలని కోరింది కేంద్రం. ఈ మేరకు ప్రధాని మోదీ సైతం వెంటనే తరలి రావాలని, దీని కోసం ఎయిర్‌ఫోర్స్ సైతం కదిలొచ్చి ఆపన్న హస్తం అందించాలని కోరారు.

యుక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు కార్యక్రమంలో పాల్గొనాలంటూ ఎయిర్ ఫోర్స్ సాయాన్ని కోరారు ప్రధాని మోదీ. ప్రస్తుతం ఎయిర్ ఇండియా ఒక్కటే విమానాల ద్వారా భారతీయులను తీసుకొస్తోంది. దీంతో తరలింపును మరింత వేగవంతం చేసేందుకు ఎయిర్ ఫోర్స్ సాయాన్ని కోరారు ప్రధాని మోదీ.

ఎయిరిండియా విమానంలో 250 మంది వరకూ తీసుకొచ్చే వీలుండగా ఎయిర్ ఫోర్స్ కు చెందిన సీ-17 విమానంలో ఒకేసారి 1000 మందిని తీసుకురావొచ్చు. ఇన్ని రోజులుగా ఎయిరిండియాతో తరలింపు కార్యక్రమం చేపట్టిన ఇండియా.. ఒక్కసారిగా కీవ్ ను ఖాళీ చేసి వచ్చేయండి అని ఆదేశాలు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.