Hattie Retroage : బాయ్ ఫ్రెండ్‌తో బ్రేకప్.. 35 ఏళ్ల యువకులకు వలవేస్తున్న 85 ఏళ్ల బామ్మ

48 ఏళ్ల క్రితం విడాకులు అయిన నాటి నుంచి ఇప్పటి వరకు తనకంటే చిన్న వయసు యువకులతోనే డేటింగ్ చేసేందుకు ఇష్టపడుతున్నానంటుంది న్యూయార్క్ కు చెందిన 84 ఏళ్ల హట్టి రెట్రోజ్. ఈమధ్యనే 39 ఏళ్ల తన బాయ్ ఫ్రెండ్ తో విడిపోయిన హట్టి... మరొక బాయ్ ఫ్రెండ్ కోసం బంబుల్ అనే డేటింగ్ యాప్ లో తన ప్రొఫైల్ ను పోస్ట్ చేసింది.

Hattie Retroage : బాయ్ ఫ్రెండ్‌తో బ్రేకప్.. 35 ఏళ్ల యువకులకు వలవేస్తున్న 85 ఏళ్ల బామ్మ

Hattie Retroage

Hattie Retroage : 48 ఏళ్ల క్రితం విడాకులు అయిన నాటి నుంచి ఇప్పటి వరకు తనకంటే చిన్న వయసు యువకులతోనే డేటింగ్ చేసేందుకు ఇష్టపడుతున్నానంటుంది న్యూయార్క్ కు చెందిన 84 ఏళ్ల హట్టి రెట్రోజ్. ఈమధ్యనే 39 ఏళ్ల తన బాయ్ ఫ్రెండ్ తో విడిపోయిన హట్టి… మరొక బాయ్ ఫ్రెండ్ కోసం బంబుల్ అనే డేటింగ్ యాప్ లో తన ప్రొఫైల్ ను పోస్ట్ చేసింది.

పిల్లలను కనీసం కాలేజీ చదువుల కోసం కూడా పంపలేని తన మొదటి భర్త నుండి 1984లో విడాకులు తీసుకున్న హట్టి ఒకానొక సందర్భంలో బాయ్ ఫ్రెండ్ కావాలంటూ పేపర్ యాడ్ కూడా ఇచ్చిందట. ఇక తనకంటే చిన్నవయసున్న యువకులతో డేటింగ్ లకు వెళ్తున్న ఇద్దరు కూతుళ్ళు ముగ్గురు మనవరాళ్లు ఉన్న ముద్దుల బామ్మా… ఈమధ్యనే ఇజ్రాయిల్ నుంచి కూడా తనకు డేటింగ్ ప్రపోజల్స్ వచ్చినట్టు సిగ్గుపడుతూ చెబుతుంది.

ఇక రోజుల వ్యవధిలో ఇష్టమొచ్చినట్లుగా బాయ్ ఫ్రెండ్లను మార్చేస్తున్న ఈబామ్మ గారి దెబ్బకు డేటింగ్ యాప్ లు సైతం సరిపోవడం లేదంట. బామ్మ ప్రొఫైల్ కనిపించిందంటే వెంటనే బ్లాక్ చూస్తున్నారట యాప్ నిర్వాహకులు.