Spain : పార్లమెంట్‌‌లో ఎలుక, ఎంపీల పరుగో..పరుగు..

స్పెయిన్ లోని సెవిల్ ఆండలూసియా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ముఖ్యమైన ఓ అంశంపై ఓటింగ్ జరుగుతోంది. దీనిపై స్పీకర్ స్థానంలో ఉన్న మార్తా బోస్కెట్ మాట్లాడుతూ.. నోరెళ్లబెట్టారు. దీనికి అక్కడున్న ఎంపీలు ఏమైంది అని ఆశ్చర్యపోయారు.

Spain : పార్లమెంట్‌‌లో ఎలుక, ఎంపీల పరుగో..పరుగు..

Parliament

Parliament In Spain : పార్లమెంట్‌‌లో ఓ ఎలుక హల్ చల్ చేసింది. దీని కారణంగా..ఎంపీలు అటూ ఇటూ పరుగులు పెట్టారు. ఎక్కడ ఎలుక కరుస్తుందోనన్న భయం వారిలో కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఎలాగోలా ఎలుక బయటకు పోవడంతో ఎంపీలందరూ హమ్మయ్యా అని ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన స్పెయిన్ లో చోటు చేసుకుంది.

Read More : YSR Kapu Nestham : ఒక్కొక్కరి ఖాతాలోకి రూ.15వేలు, రెండో విడత వైఎస్ఆర్ కాపు నేస్తం అమలు

స్పెయిన్ లోని సెవిల్ ఆండలూసియా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ముఖ్యమైన ఓ అంశంపై ఓటింగ్ జరుగుతోంది. దీనిపై స్పీకర్ స్థానంలో ఉన్న మార్తా బోస్కెట్ మాట్లాడుతూ..నోరెళ్లబెట్టారు. దీనికి అక్కడున్న ఎంపీలు ఏమైంది అని ఆశ్చర్యపోయారు. ఓ ఎలుక పార్లమెంట్ లోకి ప్రవేశించి అటూ..ఇటూ పరుగెత్తింది. దీంతో అక్కడున్న ఎంపీలు పరుగులు తీశారు.

Read More : ‘Good Medicine’ : భర్త చనిపోయిన ఏడాది తరువాత బిడ్డను కన్న భార్య

కొందరు టేబుళ్లు, కుర్చీలపై కూర్చొన్నారు. ఎలుకను బయటకు తరిమేందుకు ఇతర ఎంపీలు, అక్కడున్న సిబ్బంది ప్రయత్నించారు. కాసేపటికీ ఎలాగోలా ఆ ఎలుక బయటకు వెళ్లిపోయింది. దీంతో ఎంపీలందరూ చప్పట్లు కొట్టారు. మళ్లీ సభను కొనసాగించారు స్పీకర్. దీనికి సంబంధించిన వీడియోను Reuters ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది.