‘Good Medicine’ : భర్త చనిపోయిన ఏడాది తరువాత బిడ్డను కన్న భార్య

భర్త చనిపోయిన ఏడాది దాటాక అంటూ 14 నెలలకు ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. భర్తతో ముగ్గురు పిల్లలను కనాలనుకున్న ఆమె త్వరలోనే మరో బిడ్డను కంటానంటోంది.

‘Good Medicine’ : భర్త చనిపోయిన ఏడాది తరువాత బిడ్డను కన్న భార్య

Us, Oklahoma 40 Years Sarah Shellenberger

నా భర్త కోవిడ్ తో బాధపడుతూ హాస్పిటల్ లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు..నా భర్త చనిపోయినా నేను అతని పిల్లలకు తల్లినవ్వాలని అనుకుంటున్నా..దయచేసి నా భర్త వీర్యాన్ని నాకు అందేలా చేయాలని ఓ యువతి గుజరాత్ లోని అహ్మదాబాద్ కోర్టును ఆశ్రయించింది. భర్త చనిపోయినా అతని ప్రతిరూపం కావాలనే ఆమె కోరికను ధర్మాసనం అంగీకరించింది. అనుమతినిచ్చింది. ఇది భారతీయ మహిళ ఆకాంక్ష. అటువంటిదే అమెరికాలోని ఓక్లహామా రాష్ట్రంలో మరో మహిళ తన భర్త చనిపోయిన 14 నెలలకు పండండి బిడ్డకు జన్మనిచ్చింది. తన భర్త వీర్యంతో. ఆ బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. ఓక్లహామాకు చెందిన షెలెన్ బెర్గర్ అనే టీచర్ తన భర్త వీర్యాన్ని భద్రపరిచి భర్త చనిపోయిన తరువాత ఆ వీర్యంతో గర్భం దాల్చింది. అలా గత మే నెలలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అది కూడా భర్త కోరికతోనే.

షెలెన్ బెర్గర్ కు 2018 సెప్టెంబర్ లో స్కాట్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఇద్దరూ ఒకరంటే మరొకరికి ప్రాణంగా ఉండేవారు. ముగ్గురు పిల్లల్ని కని సంతోషంగా జీవించాలని ఆశపడేవారు. అలా సంతోషంగా సాగిపోతున్న వారి సంసారంలో స్కాట్ కు వచ్చి గుండెపోటుతో విషాదం నెలకొంది. స్కాట్ హార్ట్ ఎటాక్ తో గత ఫిబ్రవరిలో ప్రాణాలు విడిచాడు. అంతే షెలెన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. భర్తను తలచుకుని పదే పదే విలపించేది. స్కాట్ కు హార్ట్ ఎటాక్ రావటంతో అతన్ని హాస్పిటల్ కు తరలించిన క్రమంలో అతను బత్రకటం కష్టమని డాక్టర్లు చెప్పగా..షెలెన్ తల్లడిల్లిపోయింది. భర్తతో పిల్లల్ని కనాలని ఆశపడింది. అదే ఆశ స్కాట్ కు కూడా ఉంది. గతంలో కూడా స్కాట్ కు ఓ సారి గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో భద్రపరిచిన పిండాలి ద్వారా పిల్లల్ని కనాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. ఆ తరువాత ఆరు నెలలకు స్కాట్ కు గుండెపోటు వచ్చి మరణించాడు.

అలా భర్త చనిపోయిన ఆరునెలలకు 40 ఏళ్ల షెలెన్ బార్బడోస్ ఫెర్టిలిటీ క్లినిక్ సహాయంతో భద్రపరిచిన పిండాల ద్వారా షెలెన్ భర్త మరనించిన నెలలకు బిడ్డకు జన్మనిచ్చింది. అంతేకాదు ఈ ప్రక్రియలో మరో పిండం భద్రపరిచే ఉంది. ఆ పిండంతో షెలెన్ మరో బిడ్డను కనాలని అనుకుంటోంది. 2022 చివరి నాటికి రెండో బిడ్డను కనాలనుకుంటోంది.

ఇలా భర్త చనిపోయాక బిడ్డను కన్న ఆనందంలోసారా మాట్లాడుతూ..తన భర్త..తాను ముగ్గురు పిల్లల్ని కనాలని అనుకునేవారమనీ..కానీ ఇంతలోనే నా భర్తను కోల్పోయాను. కానీ అతని ప్రతిరూపాలను మాత్రం నేను గుండెల్లో పెట్టి పెంచుకుంటానని భావోద్వేగంతో తెలిపింది. అలా నా భర్త ప్రతిరూపంగా ఓ బిడ్డను కన్నాను..ఆ బిడ్డను చూస్తుంటే నాకు కలిగే సంతోషం గురించి చెప్పలేకున్నాను..ఈ చిన్నారి రాకతో నా జీవితంలో కొత్త ఆశలు చిగురించాయి. నా భర్త నాతోనే ఉన్నారనే ఫీలింగ్..నా మాతృహృదయానికి కలిగే ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నానంటూ తన బిడ్డను ముద్దాడుతూ తెలిపింది.

నా చిన్నారిని గుండెలకు హత్తుకుంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేను. నా తల్లి మనస్సు త్రుళ్లిపడుతోంది. నా పిల్లలకు తండ్రిలేని లోటు తెలియకుండా పెంచుతాననంటోందీ అమ్మ. భర్త చనిపోయిన తరువాత కన్న ఆ బిడ్డను సారా ముద్దుగా ‘గుడ్ మెడిసిన్’అని పిలుచుకుంటోంది.