YSR Kapu Nestham : ఒక్కొక్కరి ఖాతాలోకి రూ.15వేలు, రెండో విడత వైఎస్ఆర్ కాపు నేస్తం అమలు

కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా సీఎం జగన్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నారు. వరుసగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. లబ్దిదారులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. తాజాగా వరుసగా రెండో ఏడాది వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం పథకాన్ని

YSR Kapu Nestham : ఒక్కొక్కరి ఖాతాలోకి రూ.15వేలు, రెండో విడత వైఎస్ఆర్ కాపు నేస్తం అమలు

Ysr Kapu Nestham

YSR Kapu Nestham : కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా సీఎం జగన్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నారు. వరుసగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. లబ్దిదారులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. తాజాగా వరుసగా రెండో ఏడాది వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం పథకాన్ని సీఎం జగన్‌ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి గురువారం(జూలై 22,2021) లాంఛనంగా ప్రారంభించారు. మహిళల బ్యాంకు ఖాతాల్లోకి వైఎస్సార్‌ కాపునేస్తం సొమ్ము నేరుగా జమ చేశారు.

ఈ పథకం కింద కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,27,244 మంది పేద మహిళలకు రూ.490.86 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ మొత్తాన్ని బ్యాంకులు పాత అప్పుల కింద జమ చేసుకోకుండా అన్‌ ఇన్‌కమ్‌బర్డ్‌ ఖాతాల్లో నగదు జమ చేశారు.

వరసగా రెండో ఏడాది కూడా ఈ పథకం అమలు చేస్తున్నామని, మేనిఫెస్టోలో చెప్పకపోయినా ‘వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం’కు శ్రీకారం చుట్టామని సీఎం జగన్ తెలిపారు. రెండేళ్లలో ‘వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం’ కింద రూ.12,126 కోట్లు అందించామన్నారు. 3,27,244 మంది లబ్దిదారులకు నేరుగా నగదు జమ చేస్తున్నామని తెలిపారు. వివక్షకు తావు లేకుండా, అవినీతి లేకుండా ఈ పథకం అమలు చేస్తున్నామని, ప్రతి అర్హుడికి మంచి జరగాలని, అలాంటి వారికి మిస్ కాకూడదని చెప్పారు. అర్హత ఉన్న కాపు మహిళలు గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సీఎం జగన్ చెప్పారు.

వైఎస్సార్‌ కాపు నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన పేద మహిళలకు ఏటా రూ.15 వేల చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75వేల ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ పథకం ద్వారా గత ఏడాది 3,27,349 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.491.02 కోట్లు జమ చేయగా, నేడు 3,27,244 మంది పేద కాపు మహిళలకు అందించిన రూ.490.86 కోట్లతో కలిపి మొత్తం రూ.981.88 కోట్ల లబ్ధి కలుగుతుంది అని సీఎం అన్నారు.

నిరుపేదలుగా ఉన్న కాపు అక్క చెల్లెమ్మలకు ఆర్థిక స్వాలంబన రావాలని ఈ మంచి పథకాన్ని తీసుకొచ్చామని సీఎం అన్నారు. వైయస్సార్‌ చేయూత మాదిరిగానే వైయస్సార్‌ కాపునేస్తం తీసుకొచ్చామన్నారు. తమ కాళ్ల మీద నిబడగలుగుతారనే గొప్ప ఆలోచన నుంచి ఈ పథకం పుట్టిందన్నారు. ఏ నెల్లో ఇస్తున్నాం అన్నది ముందుగానే చెప్తున్నామని, వారిలో భరోసాను కల్పిస్తున్నామని అన్నారు. తద్వారా ఆర్థికంగా వారు ప్రణాళిక వేసుకోగలుగుతారని సీఎం అననారు. వ్యాపారాలు చేసుకోవాలన్న ఆలోచన వారికి కలుగుతోందన్నారు. ఇలాంటి కార్యక్రమంలో భాగంగా 45-60 ఏళ్లలోపు ఉన్నవారికి ఈ సహాయం చేస్తున్నాం. ఈ వయస్సుల్లో ఉన్నవారు త్యాగమూర్తులు, కుటుంబ బరువు బాధ్యతలను మోస్తున్నవారు. వైయస్సార్‌ కాపు నేస్తం ద్వారా కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు లబ్ధి కలుగుతుంది.

గత ప్రభుత్వం ఇదే కాపుల కోసం ఏడాదికి వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పింది. కానీ, రూ.400 కోట్లు కూడా ఇవ్వలేదు. అప్పటి పరిస్థితులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ రెండేళ్ల పాలనలో వివిధ పథకాల ద్వారా అక్షరాల 59,63,308 మందికి గత ప్రభుత్వం కన్నా ఎక్కువగా 15 రెట్లు మేర రూ. 12,126.78 కోట్లు సాయం చేశామని సీఎం జగన్ చెప్పారు.