Spider-Scorpion Mix Bug : ఇదో రాకాసి పురుగు.. సగం తేలు.. సగం సాలీడు!

ఇదో రాకాసి పురుగు.. చూడటానికి చాలా వింతగా ఉంది. సగం తేలులా ఉంటే.. మిగతా సగం సాలీడులా ఉంది.. ముందుభాగం తేలు మాదిరిగా.. వెనుక భాగం సాలీడులా కనిపిస్తోంది.

Spider-Scorpion Mix Bug : ఇదో రాకాసి పురుగు.. సగం తేలు.. సగం సాలీడు!

A 'spider Scorpion Mix' Bug Goes Viral After Us Park Service

Spider-Scorpion Mix Bug : ఇదో రాకాసి పురుగు.. చూడటానికి చాలా వింతగా ఉంది. సగం తేలులా ఉంటే.. మిగతా సగం సాలీడులా ఉంది.. ముందుభాగం తేలు మాదిరిగా.. వెనుక భాగం సాలీడులా కనిపిస్తోంది. ఈ వింతైన పురుగు ఫొటోను యూఎస్ ఫెడరల్ ఏజెన్సీ నేషనల్ పార్క్ సర్వీసు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది. ఈ వింతైన పురుగు పేరు.. vinegaroon లేదా whip scorpion గా పిలుస్తున్నారు. థెలిఫోనిడా అరాక్నిడ్స్ ఉప జాతికి చెందినది.. ఈ రకం పురుగుల్లో 100 జాతులు మాత్రమే ఉన్నాయి. విప్ స్కార్పియన్ అనేది తేళ్ళను పోలి ఉంటుంది. వీటికి అదనంగా తోక‌ను కలిగి ఉంటాయి.

సాధారణంగా ఈ వెనగరూన్స్ మూడు అంగుళాల వరకు పెరుగుతాయి. వాటికి జోలికి పోనంతవరకు వేటికి హాని చేయవు. ఒకవేళ ఇది దాడిచేస్తే.. 85శాతం కచ్చితంగా లక్ష్యాన్ని ఛేదిస్తాయి. ఈ వింతైన పురుగులు బొరియల్లో నివసిస్తాయి. ఆహారం కోసం అప్పుడప్పుడు బయటికి వస్తుంటాయి. తమ ఆహారంగా మిల్లిపెడ్స్, చిన్న తేళ్లు, క్రికెట్స్, బొద్దింకలను వేటాడి తినేస్తుంటాయి.

ముందు కాళ్ల సాయంతో వైబ్రేషన్ల ద్వారా తమ ఆహారాన్ని గుర్తిస్తుంటాయి. ఈ రకం పురుగులు ఎక్కువగా ఎడారి ప్రాంతాల్లో కనిపిస్తాయి. నేషనల్ పార్కు సర్వీసు అధికారుల ప్రకారం.. ఈ వింత పురుగు ఆడదిగా గుర్తించారు. అంతేకాదు.. తన వెనుక భాగంలో పిల్లలను కూడా మోసుకెళ్తున్నట్టు గుర్తించారు. ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాక దాదాపు 95వేల లైక్సు రాగా.. 2వేల కామెంట్లు వచ్చాయి.