Adani Group : మూడు రోజుల్లోనే 5.6 లక్షల కోట్లు నష్టం .. ప్రపంచ కుబేరుల జాబితాలో ఎనిమిదో స్థానానికి పడిపోయిన అదానీ

హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌తో అదానీ స్రామ్యాజ్యంలో షేర్ల పతనం కొనసాగుతోంది.అపర కుబేరుడు అదానీ ఆస్తులు క్రమంగా కరిగిపోతున్నాయి. హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌తో అదానీ కంపెనీ ఆస్తులు ఒక్కసారిగా ఆవిరైపోతున్నాయి. శని, ఆదివారాలు గ్యాప్ తరువాత కూడా షేర్ల పతనం కొనసాగుతోంది. దీంట్లో భాగంగా అదానీ కంపెనీకి సంబంధించి మూడు రోజుల్లో 5.6 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. దీంతో ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ స్థానం అంతకంతకూ దిగజారి పోతోంది. ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ ఎనిమిదో స్థానానికి పడిపోయారు.

Adani Group : మూడు రోజుల్లోనే 5.6 లక్షల కోట్లు నష్టం .. ప్రపంచ కుబేరుల జాబితాలో ఎనిమిదో స్థానానికి పడిపోయిన అదానీ

Adani investors lose Rs 5.6 lakh crore

Adani Group :  హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌తో అదానీ స్రామ్యాజ్యంలో షేర్ల పతనం కొనసాగుతోంది.అపర కుబేరుడు అదానీ ఆస్తులు క్రమంగా కరిగిపోతున్నాయి. హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌తో అదానీ కంపెనీ ఆస్తులు ఒక్కసారిగా ఆవిరైపోతున్నాయి. శని, ఆదివారాలు గ్యాప్ తరువాత కూడా షేర్ల పతనం కొనసాగుతోంది. దీంట్లో భాగంగా అదానీ కంపెనీకి సంబంధించి మూడు రోజుల్లో 5.6 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. దీంతో ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ స్థానం అంతకంతకూ దిగజారి పోతోంది. ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ ఎనిమిదో స్థానానికి పడిపోయారు. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు కొనసాగుతున్నాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్ మినహా మిగిలిన అన్ని షేర్లు నష్టాల్లోనేకొనసాగుతున్నాయి. దీంతో అదానీ గ్రూప్ పతనం కొసాగూ అంతకంతకు దిగజారిపోతోంది. హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌ అదానీ స్రామ్యాజ్యంలో చిచ్చు పెట్టింది. దీంతో ఒకప్పుడు అంబానీనే తలదన్ని అంత్యం తక్కువ కాలంలోనే తారాజువ్వలా ఆకాశానికి దూసుకుపోయిన ఆదానీ సంపద హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌ తో ఒక్కసారిగా పతనమైపోతోంది. నిన్నటి ముంగిపుతో పోలీస్తే స్వల్ప లాభాలాతో స్టాక్ మార్కెట్లు కొసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీలు వెంటనే నష్టాల బాట పట్టాయి. 300 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్ కొనసాగుతోంది.

ADANI ..Hindenburg Report : అదానీ గ్రూప్ కంపెనీల పునాదుల్ని షేక్ చేసిన ‘ఒక్క రిపోర్ట్’‌.. హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్ చెప్పిందేంటి..?

శని, ఆదివారాలు స్టాక్‌మార్కెట్లకు సెలవు కావడంతో.. అదానీ గ్రూప్ షేర్ల పతనానికి కాస్త గ్యాప్‌ వచ్చింది. మ్యాటర్‌ సెట్ చేసుకోవడానికి అదానికి కాస్త టైమ్‌ దొరికింది. కానీ సోమవారం కూడా అదానీ షేర్ల పతనం కొనసాగింది. శని, ఆదివారాల గ్యాప్ లో కూడా అదానీ గ్రూప్ ఎటువంటి చర్యలు తీసుకోకపోవటంతో షేర్ల పతనం కొసాగుతోంది. షేర్ల పతనం తగ్గాలన్నీ కాస్త ఊరట పొందాలన్నా అదానీ వెంటనే చర్యలు చేపట్టాల్సిన అవసరం చాలా చాలా ఉందంటున్నారు ఆర్థిక నిపుణులు. లేదంటే ఈ పతనం కొనసాగే అవకాశాలున్నాయంటున్నారు.

Hindenburg Report On ADANI Group : షేర్ మార్కెట్‌ని షేక్ చేసిన హిండెన్‌బర్గ్ రిపోర్ట్..చట్టపరమైన చర్యలు తీసుకునే యోచనలో అదానీ గ్రూప్

అదానీ కంపెనీల్లో ఎల్‌ఐసీ పెట్టిన పెట్టుబడులు రెండు రోజుల్లోనే రూ.18,000 కోట్లకుపైగా తరిగి పోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎల్ఐసీ పరిస్థితేంటీ? అంతేకాదు అదానీ గ్రూప్‌లోని అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, ఏపీ సెజ్‌ లిమిటెడ్‌, అదానీ పవర్‌, అదానీ విల్మర్‌ సంస్థలకు విచ్చలవిడిగా లోన్లు ఇచ్చాయి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా. హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌ బయటకు రావడంతో.. ఈ బ్యాంకుల పరిస్థితి ఏంటీ ఈ బ్యాంకు కష్టమర్ల పరిస్థితి ఏంటీ అనేది అగమ్యగోచరంగా మారింది. అదానీ గ్రూప్ షేర్ల పతనం ఇలాగే కొనసాగితే బ్యాంకుల షేర్లపై ఒత్తిడి తప్పదని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒత్తిడి పెరిగితే బ్యాంకుల షేర్లు మరింత నష్టపోయే ప్రమాదం ఉందంటున్నారు.

Hindenburg Report-ADANI Group: అదానీకి ఐదు సవాళ్లు.. అందరి ఆశలు జనవరి 30పైనే..